సైనసైటిస్‌ సమస్యే కాదు!

17-07-2018: ‘సైనసైటిస్‌’ అనేది వినేవాళ్లకు ఒక పదమే కావచ్చు. కానీ, దాని బారిన పడిన వాళ్ల బాధలు ఇన్నీ అన్నీ కావు. తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి ద్రవాలు కారడం, వాసన తెలియకపోవడం, తల బరువు, చిగుళ్ల నొప్పి లాంటి లక్షణాలు పెద్ద చిరాకు పెడతాయి. ముక్కుకు ఇరువైపులా, కళ్ల పైనా ఉండే గాలి గదుల్లో వైరస్‌, బ్యాక్టీరియా చేరిపోవడమే ఈ సమస్యకు అసలు మూలం. మౌలికంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఈ సమస్యకు ఎక్కువగా గురవుతుంటారు. అయితే సమస్య మొదలైన వెంటనే, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తే, సమస్య అంతటితో సమసిపోతుంది. హోమియోలోని ఇచ్‌నేసియా అనే ద్రావణం (మదర్‌ టించర్‌) వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుంది.
 
హోమియో వైద్యంలో..
ఒక దశలో సైన్‌సలోని ద్రవాలు బాగా చిక్కబడి, దారంలా బయటికి వస్తూ గొంతులోకి కూడా జారుతుంటాయి. ఈ స్థితిలో శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి వారికి కాలిబైక్రోమియం- 200 (పొటెన్సీ) మందు బాగా పనిచేస్తుంది. పిల్లలకైతే 30 పొటెన్సీ సరిపోతుంది. హోమియోలోని ఏ మందైనా పిల్లలకు 30 పొటెన్సీలో ఇస్తే చాలు.
కొందరికి ఈ సమయంలో కడుపు ఉబ్బరంగానూ, మంటగానూ ఉండడంతో పాటు లాలాజలం ఎక్కువగా వస్తూ ఉంటుంది. నోరు, ముక్కు నుంచి దుర్వాసన కూడా వేస్తుంది. ముక్కు నుంచి వచ్చే ద్రవాలు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఇలాంటి వారికి మెర్క్‌సాల్‌ - 200 మందు సమర్థంగా పనిచేస్తుంది.
కొంత మందికి ద్రవాలు కారడంతో పాటు, విపరీతంగా తుమ్ములు, తలంతా బరువుగా అనిపిస్తుంది. అలాంటి వారికి టూక్రియం - 200 మందు బాగా పనిచేస్తుంది.
సమస్య తీవ్రతను బట్టి కొంతమందికి ఈ సమస్య 3 లేదా 6 నెలల్లో పూర్తిగా త గ్గిపోతుంది. ఒక వేళ ఏడెనిమిదేళ్లుగా ఉన్న సమస్య అయితే ఇంకా ఎక్కువ సమయమే పట్టవచ్చు. కాకపోతే, వైద్య చికిత్సలతో పాటు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
 
- డాక్టర్‌ బి. అనిల్‌ కుమార్‌
కన్సల్టెంట్‌ హోమియో
వైద్య నిపుణులు,
జయ భాగ్యలక్ష్మి
హోమియో క్లినిక్‌,
మియాపూర్‌ , హైదరాబాద్‌