రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు సరైన వైద్యం

ఆంధ్రజ్యోతి, 11-9-2016:‘రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌’ అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అనగా మన శరీర రోగనిరోధక వ్యవస్థ పొరబడి, మన సొంత కణజాలంపై దాడిచేయడం వలన కలిగే వ్యాధులను ఆటోఇమ్యూన్‌ వ్యాధులు అని అంటారు. ఈ వ్యాధినే వాడుక భాషలో ‘వాతదోషం’ అని అంటారు. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ వ్యాధి ఎక్కువగా 40 సం.. వయస్సు పైబడిన వారిలో తలెత్తుతుంది. పురుషుల కంటే స్ర్తీలలో 3 రెట్లు అధికంగా, ముఖ్యంగా రుతుచక్రం ఆగిపోయిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 16 సం.. వయస్సు లోపువారిలో ఈ వ్యాధి తలెత్తినచో, దీనిని వైద్య పరిభాషలో ‘జువైనల్‌ ఆర్థరైటిస్‌’ అని అంటారు.

 
ఈ వ్యాధి కేవలం కీళ్లనే కాకుండా, ఇతర ముఖ్య అవయవాలైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం, రక్తనాళాలు, చర్మం మరియు శరీరంలోని వివిధ రకాల కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా కీళ్ళలోని సైనోవియం పొరను శోథమునకు గురిచేసి, తద్వారా క్రమంగా కీళ్లలోని ఎముకలను, వాటి తాలుకు కార్టిలేజ్‌ని కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా కీళ్లు వాటి ఆకారం, అమరికను కోల్పోయి విపరీతమైన నొప్పి కలగటంతో పాటు కీళ్ల కదలికలు కష్టతరం అవుతాయి. దీర్ఘకాలికంగా ఈ వ్యాధికి గురి అయినట్లయితే వ్యాధి తీవ్రత మరింత పెరిగి, కీళ్ల అమరికలో మార్పులు ఏర్పడి, కీళ్ల వైకల్యానికి దారి తీస్తుంది. కాబట్టి మొదట్లోనే దీనిని గుర్తించి, సరైన చికిత్స అందిచటం ద్వారా ఈ వ్యాధిని అంకురం నుంచే సమూలంగా తొలగించే అవకాశం ఉంటుంది.

కారణాలు

ఈ వ్యాధి తలెత్తటానికి గల కచ్చితమైన కారణాల పరంగా ఇంతవరకు స్పష్టత లేదు. కానీ జన్యుపరమైన అంశాలు మాత్రం 50 శాతం వరకు ఈ వ్యాధికి కారణాలుగా ఉండవచ్చు.
జన్యుపరమైన సిద్ధత కలిగి ఉన్న కారణంగా కొన్ని వాతావరణ అంశాలతో పాటు, బ్యాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌లు ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయి.
కుటుంబ చరిత్ర , పొగ తాగడం, అధిక బరువును కలిగి ఉండటం వంటి అంశాల వలన కూడా ఈవ్యాధి ప్రేరేపించబడే అవకాశం ఉంది.
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ బాధపడే వారిలో 80 శాతం వరకు రుమాటాయిడ్‌ ఫ్యాక్టర్‌ అనే యాంటీబాడీని కలిగియున్నారు.

లక్షణాలు

ఈ వ్యాధికి గురైన కీళ్లలో - వాపు, నొప్పి , చేతితో తాకితే వేడిగా అనిపించడం, ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోవడం
శరీరంలోని ఇరు పార్వ్శాల్లో ఉండే ఒకే రకమైన కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి లక్షణం.
ఈ వ్యాధి మొదట చిన్న కీళ్లు అయిన చేతి వేళ్లు, కాలి వేళ్లు, వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మణికట్టు, మోచేతులు, భుజాలు, మోకాళ్లు, తుంటి, చీలమండలం వంటి కీళ్లను ప్రభావితం చేస్తుంది.
కీళ్లు ప్రాంతపు చర్మం కింద ఫైబ్రస్‌ కణజాలం పెరగడంతో అవి బయటకు చిన్న కణితుల్లా కనిపిస్తాయి. వీటినే రుమాటాయిడ్‌ నాడ్యుల్స్‌ అని అంటారు.
వీటితో పాటు నీరసం, రక్తహీనత, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, జ్వరం వంటి లక్షణాలు కూడా గమనించవచ్చు.
ఈ వ్యాధి ప్రభావం- ఇతర ప్రధాన అవయవాలైన కళ్లు, చర్మం, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల పైన ఉండటం వలన కళ్లు , నోరు పొడిబారడం, ఛాతిలో నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వలన గుండెనొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు

సి.బి.పి, ఇ.ఎ్‌స.ఆర్‌, ఆర్‌.ఏ. ఫ్యాక్టర్‌, ఏఎన్‌ఏ, యాంటీ సిసిపీ, ఎక్స్‌-రే, ఎమ్‌ఆర్‌ఐ మొదలైన పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స
చాలా రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులు ‘సైకోసోమాటిక్‌ డిజార్డర్స్‌’ కిందకు వస్తాయి. అన్ని రకాల సైౖకోసోమాటిక్‌ డిజార్డర్స్‌కు హోమియోలో చక్కని పరిష్కారం ఉంది. ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకు ఇతర చికిత్సా విధానాల్లో శాశ్వత నివారణ లేదు. కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో అందించే కాన్స్‌టిట్యూషనల్‌ వైద్య చికిత్సా విధానంలో భాగంగా, రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిచడం ద్వారా ఈ వ్యాధి సంపూర్ణంగా నయం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతర కాంప్లికేషన్స్‌ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌

CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు