హోమియోతో అంగస్తంభన సమస్య దూరం

ఆంధ్రజ్యోతి, 02-05-2013: శ్రీనివాస్‌కి 28 సంవత్సరాలు. ఆరునెలల క్రితం అందమైన అమ్మాయితో పెళ్ళయింది. తను ఊహించుకున్న దానికన్నా అందగత్తె భార్యగా రావడంతో ఆనందానికి అవధులు లేదు. ఇతరత్రా ఆర్థిక ఇబ్బందులు కూడా లేకపోవడంతో శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేశాడు. ఆరు నెలలు ఆరు రోజుల్లా గడిచిపోయాయి. కానీ ఒకరోజు పడకగదిలో వైఫల్యం. ఎంత ప్రయత్నించినా అంగస్తంభన కాలేదు. అనుకోకుండా వచ్చిన మార్పు ఎందుకో అర్థం కాలేదు. రోజూ రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొనే తను ఇప్పుడు రెండు,మూడు రోజులకు ఒకసారి కూడా భార్యతో గడపడంలేదు. భార్య నోరు తెరిచి ఏమీ అడగకపోయినా సుఖాన్ని అందించకలేకపోతున్నాననే బాధ రోజురోజుకి పెరగసాగింది. భార్యప్రేరేపించినా మధ్యలోనే అంగం మెత్తబడిపోతోంది. దాంపత్య జీవితానికి ఇక పనికిరానేమో అని భావించి ఒకసారి డాక్టర్‌ని కలిసి పరిస్థితిని వివరిద్దామని నిర్ణయించుకుని నా దగ్గరకు వచ్చారు. ఎంతో ఆవేదనతో తన బాధనంత చెప్పుకోచ్చారు. అతడు అడిగిన మొదటి ప్రశ్న అంగస్తంభన సమస్య ఎందుకు తలెత్తుతుంది?
కారణాలు అనేకం 
మానసిక ఒత్తిడి, అధిక శారీరక శ్రమ, మానసిక ఆందోళన వంటివి ఈ సమస్యకు ముఖ్యకారణాలుగా చెప్పుకోవచ్చు. మానసిక ఆందోళనతో లేదా శారీరక ఒత్తిడితో వచ్చే సమస్యలను చాలా వరకు మ్చంచి వైద్యునితో కాన్సెలింగ్‌ చేయించుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. సరియైన నిద్రతో చాలా వరకు మానసిక ఒ త్తిడిని తగ్గించుకోవచ్చు. దీనివల్ల శరీరంలో లైంగికపరమైన కోరికలు పెరుగుతాయి. శృంగారానికి ముందు, మంచి ఆలోచనతో, మంచి మూడ్‌తో ప్రేరేపిస్తే అసలు సమస్య రావడం జరగదు. దంపతులు మూడ్‌ను పెంచే విషయాలను పరస్పరం చర్చించుకోవాలి. చిన్న చిన్న పనులతో మొదలుపెట్టాలి. దీంతో ఇద్దరికీ తెలియని ఉద్రేకం మొదలవుతుంది. అలాకాకుండా సరియైన వాతావరణం, పరస్పర ఆకర్షణ లేనిపక్షంలో మూడ్‌లోమార్పులు వచ్చి అంగస్తంభన వైఫల్యం జరుగుతుంది. శృంగారం విషయంలో సీ్త్ర,పురుషుల మధ్య సరియైన ఆకర్షణ లేకపోతే లైంగిక సమస్యలు తలెత్తుతాయి. భాగస్వామిలో ఒకరకమైన ఆసక్తి లేకపోయినా శృంగార జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ సీ్త్రనుంచి సరియైనప్రేరణ, కోరిక లేకపోయినా తన నిర్లిప్తత వల్ల పురుషునిలో ఒక రకమైన నిరాశావాదం ఎర్పడి అంగస్తంభన వైఫల్యం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో స్త్రీలలో కామవాంఛ అధికంగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల తను భర్తనుంచి పరిపూర్ణమైన శృంగారజీవితాన్ని ఆశిస్తుంది. శృంగారంలో వివిధ భంగిమలను, వివిధ ప్రేరణలను ఆశించడం జరుగుతుంది. అతిగా ఆసక్తి చూపుతున్న స్త్రీని చూచి మగవాడిలో ఒకరకమైనభయం ఏర్పడుతుంది. అది తన లైంగికశక్తిపైన పడి అంగవైఫల్యానికి దారితీస్తుంది. ఫలితంగా నిద్ర లేకపోవడం, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మరింత ఎక్కువై చాలా సార్లు అంగస్తంభన సమస్యతో సతమతమవుతారు. వ్యాపారాలు, కాల్‌సెంటర్లలో పనిచేసే వారిలో తెలియకుండా మానసిక ఒత్తిడితో అంగస్తంభన వైఫల్యం జరుగుతోంది.
అనాసక్తి కారణమే 
మధ్య వయస్కుల్లో అప్పుడప్పుడు అంగస్తంభన వైఫల్యం జరగడం సాధారణంగా కనిపిస్తుంది. లైంగికపరమైన కోరికలు తగ్గినట్లుగా అనిపిస్తాయి. జీవనవిధానంలో మార్పులు సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. కొందరిలో 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో శృంగారంపైన ఒకరకమైన అనాసక్తి ఏర్పడుతుంది. దీనివల్ల తరచుగా అంగస్తంభన వైఫల్యం జరుగుతుంది. దీనికి కారణం పరస్పర ఆకర్షణ తగ్గడం. కొంతమంది ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల లైంగికసామర్థ్యం పెరుగుతుందని భావిస్తారు. మొదట్లో అలా అనిపించినా తరువాత సమస్య మరింత తవ్రమవుతుంది. డయాబెటిస్‌ ఉన్నవారిలో రక్తప్రసరణ సమస్యలు ఏర్పడి అంగానికి తగినంత రక్తసరఫరా జరగక అంగస్తంభన జరగదు. రక్తపోటు, ఉబ్బసం, గుండె జబ్బులు, సయాటిక సమస్యలతో బాధపడేవారిలో చాలామందిలో ఈ సమస్య కనపడుతుంది. కొన్నిరకాల మందులు వాడటం వల్ల, స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల, డిప్రెషన్‌కు వాడే మందుల వల్ల అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గడం వల్ల కూడా అంగస్తంభనలో వైఫల్యం ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. పొగతాగే అలవాటు ఉన్నవారిలో రక్తప్రసరణ సమస్యలతో లైంగిక కోరికలు తగ్గి శృంగార జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
వ్యాధి నిర్ధారణ 
ముందుగా శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించాలి. లైంగికజీవితం గురించిన పూర్తి సమాచారం రాబట్టాలి. పినైల్‌ డాప్లర్‌ స్టడీ, టెస్టోస్టిరాన్‌లెవెల్స్‌, టీఎస్‌హెచ్‌, బ్లడ్‌షుగర్‌ లెవెల్స్‌, ప్రొస్టేట్‌ ఎగ్జామినేషన్‌లాంటి పరీక్షలతో అంగస్తంభన వైఫల్యాలను గుర్తించవచ్చు.
చికిత్స 
లైంగిక సమస్యలను దూరం చేసే ఔషధాలు హోమియోలో చాలా ఉన్నాయి. లైంగిక సమస్యలకు ముఖ్యంగా అంగస్తంభన వైఫల్యం, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలకు హోమియో మందులు వరప్రసాదంగా పనిచేస్తాయనండంలో అతిశయోక్తి లేదు. ఇది చాలా సున్నితమైన అంశం. రోగిబలహీనతలపైన ఆధారపడి ఉంది. సరియైన వైద్యుని పర్యవేక్షణలో చర్చించి మందులు వాడితే లైంగిక జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. శారీరక, మానసిక లక్షణాలపై ఆధారపడి చికిత్స చేస్తే ఎలాంటి సమస్య అయినా దూరమవుతుంది. సరియైన చికిత్సతో పాటు సరియైన ఆహారం తీసుకుంటే అంగ స్తంభన సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చని వివరించడంతో శ్రీనివాస్‌లో ఎంతో ధైర్యం వచ్చింది. కొన్ని నెలలు చికిత్స తీసుకున్నాడు. ఇప్పుడు అతని శృంగార జీవితం హాయిగా సాగిపోతోంది. 

డా. మధు వారణాశి, ఎం.డి 
ప్రముఖ హోమియో వైద్యులు , 
ప్లాట్‌ నెం 188, వివేకానందనగర్‌ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌, 
ఫోన్‌ : 8897331110, 
8886 509 509.