హోమియోతో మానసిక బత్తిడి దూరం

ఆంధ్రజ్యోతి, 07-10-2013: మానసిక ప్రశాంతత ఉంటే అనారోగ్యం దూరంగానే ఉంటుంది. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి, ఆందోళన మొదలవుతుందో వ్యాధులన్నీ చుట్టుముడతాయి. చాలా వ్యాధులకు స్ట్రెస్ కారణమని పరిశోధనల్లోనూ రుజువయింది. అందుకే రోజు వారి జీవనంలో స్ట్రెస్ లేకుండా చూసుకోవాలని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ మురళి అంకిరెడ్డి. 

మానవ మెదడులో పది బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ప్రతి ఒక్క కణం ఇతర కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ అనుసంధానకములను న్యూరోట్రాన్స్‌మీటర్లు లేదా రసాయనిక ప్రసారకములు అని అంటారు. మన ఆవేశ అనుభూతులను న్యూరో ట్రాన్స్‌మీటర్లు అదుపుచేస్తాయి. మెదడులోని ఆవేశ కేంద్రంలో ఐదు రకముల రసాయనిక పదార్థాలు లేదా న్యూరోట్రాన్స్‌మీటర్లు ఉంటా యి. అధికమైన స్ట్రెస్‌ను ఎదుర్కొనుటకు ఎండా ర్ఫిన్‌ల శాతం అధికంగా కావాల్సి ఉంటుంది. ఈ విధంగా అధికమైన న్యూరోట్రాన్స్‌మీటర్లకు, ఇతర న్యూరో ట్రాన్స్‌మీటర్లకు మధ్యన ఉండాల్సిన నిష్పత్తిలో తేడా వచ్చి రసాయనిక సమతుల్యత చెడుతుంది. ఈ దశలోనే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనుభవంలోకి వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో విడుదలైన హానికరమైన రసాయనిక పదార్థాలు, శరీర కణాలకు హాని చేసి మరింత స్ట్రెస్ పెరుగుదలకు కారణమవుతుంది. ఈ విధంగా వరుసగా వచ్చే క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం అని అంటారు. 

ఆవేశ అనుభూతులపై అదుపు 

మెదడులోని కణాల మధ్య ఆవేశ అనుభూతులను ఒకదానికొకటి సందేశాలను మార్చుకొనుటలో ప్రధానపాత్ర వహించే రసాయనిక సంధానకములను న్యూరోట్రాన్స్‌మీటర్‌, నాడీరసాయనిక ప్రసారకములని అని అంటారు. ప్రధానంగా న్యూరోట్రాన్స్‌మీటర్లను ఈ విధంగా విభజించవచ్చు.
 
నార్‌ ఎడ్రినల్‌ వ్యవస్థ -ప్రేరణ, ప్రతిఫలం, డొపమిన్‌ వ్యవస్థ - చలననాడీవ్యవస్థ, ప్రతిఫలం, సంజ్ఞానం, సంవేదన, నాళరహిత గ్రంధులు, వికారం, సెరోటినిన్‌ వ్యవస్థ - అంతర్ముఖం, మనస్సుస్థితి, తృప్తి, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, నొప్పిని తగ్గించే చర్య, కోలినెర్జిక్‌ వ్యవస్థ - అభ్యాసం, స్వల్పకాల జ్ఞాపకశక్తి, ప్రేరణ, ప్రతిఫలం
 
న్యూరోట్రాన్స్‌మీటర్లపై స్ట్రెస్ ప్రభావం
రోజువారి స్ట్రెస్‌ను ఎండార్ఫిన్‌లు నిభాయిస్తాయి. వీటిని సద్భావ నాడీరసాయనిక ప్రసారకములు అని కూడా అంటారు. అధికమైన లేదా పరిమితికి మించిన స్ట్రెస్‌ను తట్టుకొనుటకు అధిక మొత్తంలో ఎండార్ఫిన్‌లను మెదడు కణాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఇతర న్యూరోట్రాన్స్‌మీటర్‌లతో ఎండార్ఫిన్‌ల మధ్యన ఉన్న నిష్పత్తిలో తేడాలు అధికమై రసాయనిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఎదుర్కొనే స్ట్రెస్ దానిని ఎదుర్కొనే సందర్భంలో వచ్చే ఆత్రుత, అత్యవసరణ ప్రేరణలు స్ట్రెస్ శాతాన్ని మరింత పెంచుతాయి. ఈ ప్రక్రియలో అనవసర, హానికర రసాయనిక పదార్థాలు విడుదలై శరీరంకు మరింత నష్టం జరుగుతుంది. 

అవయవాలపై స్ట్రెస్ ప్రభావం 
శరీరమందలి అన్ని అవయవాలు, వాటి పనితీరుపై స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. శరీరంపై సె్ట్రస్‌ప్రభావం పెరిగిన కొద్దీ ఒక వరుస క్రమంలో శరీర సాధారణ క్రియలలో మార్పులు వస్తాయి. ప్రధానంగా ఎడ్రినలిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. రక్తప్రసరణ లేదా రక్తపోటు పెరుగుదల, గుండె చలన రేటు పెరుగుదల, కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణప్రక్రియ తగ్గుదల లేదా ఆగిపోవడం జరుగుతుంది.అడ్రినలిన్‌ ఉత్పత్తి అధికమైన కొద్దీ శరీరానికి కావలసిన అధిక శక్తిని అందించుటకు ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్‌ అధికమవుతుంది. శరీరమందలి పిట్యూటరీ గ్రంధి ఎడ్రినోకార్టికోట్రోపిక్‌ హార్మోన్‌ ఏసీటీహెచ్‌ ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఈ హార్మోన్‌ కార్టిజోన్‌, కార్టిజోల్‌ హార్మోన్ల విడుదలకు ప్రేరణ కలిగిస్తుంది. ఈ హార్మోన్లు రోగక్రిములతో పోరాడి రక్తంలోని తెల్లకణాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న జబ్బులకు 80 శాతం స్ట్రెస్ కారణమవుతోందని పరిశోధకులు అంటున్నారు. ఆకస్మిక స్ట్రెస్ శరీర రసాయనిక స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెస్ కారకం దీర్ఘకాలం కొనసాగినపుడు శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీర రోగరక్షణ వ్యవస్థ బలహీనపడి కేన్సర్‌, డయాబెటిస్‌, రుమాటిజమ్‌, జీర్ణకోశ వ్యాధుల తీవ్రత పెరుగుతుంది. స్ట్రెస్ రోగాల తీవ్రతను పెంచుటకే కాకుండా రోగం తగ్గుటలో, రోగం తగ్గిన పిమ్మట కోలుకోవడాన్ని నిరోధిస్తుంది. ఏ విధంగా చూసినా ఆరోగ్య విషయంలో స్ట్రెస్ కీలకపాత్ర పోషిస్తోందనడంలో సందేహం లేదు. అందకే తప్పనిసరిగా అధిక స్ట్రెస్‌ను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. 

హోమియో చికిత్స 
న్యూరోట్రాన్స్‌మీటర్‌ రసాయనిక చర్య, ప్రతిచర్యలను పరిగణలోకి తీసుకుని దానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా? వ్యక్తి దాన్ని ఏ విధంగా తట్టుకోగలుగుతున్నాడు. న్యూరోట్రాన్స్‌మీటర్‌ ప్రభావం శారీరకంగా, మానసికంగా ఎంతవరకు రోగలక్షణాలకు కారణమవుతోందనే విషయాన్ని పరిశీలించి అందుకు తగిన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. స్ట్రెస్‌ను తగ్గించడానికి హోమియోలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే సమస్య ఇట్టే దూరమవుతుందనడంలో సందేహం లేదు. 

డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి ఎం.డి. (హోమియో) 
స్టార్‌ హోమియోపతి 
సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, దిల్‌సుక్‌నగర్‌, విజయవాడ, వైజాగ్‌, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక
www.starhomeo.com
ఫోన్స్‌ : 90300 81876, 
90300 81861