వెరికోస్‌ వెయిన్స్‌కు శాశ్వత చికిత్స

ఆంధ్రజ్యోతి,03-09-13:కొందరిలో కాలి పిక్కల భాగంలో రక్తనాళాలు మెలిపడినట్లుగా, ఉబ్బిపోయి, ముదురు నీలం రంగులో కనిపిస్తుంటాయి. ఈ సమస్యను వెరికోస్‌ వెయిన్స్‌ అంటారు. సిరల్లో రక్తం నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. చాలా మందికి ఈ సమస్యకు చికిత్స ఉందనే విషయం తెలియక వైద్యుల దగ్గరకు వెళ్లకుండా ఉండిపోతారు. కానీ హోమియో మందులతో ఈ సమస్య పూర్తిగా తొలగిపోయి రక్త సరఫరా సాఫీగా జరుగుతుందని అంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ పవన్‌రెడ్డి.

 
 
కొందరిలో సిరలు మెలిపడటం, ఉబ్బడం జరుగుతుంది. సాధారణంగా కాలి పిక్కల భాగంలో ఎక్కువ ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని వెరికోస్‌ వెయిన్స్‌ అంటారు. హెమరాయిడ్స్‌ కారణంగా హెమరాయిడల్‌ వెయిన్స్‌, వెరికోసిల్‌ కారణంగా స్పెర్‌మాటిక్‌ వెయిన్‌ ఏర్పడుతుంది. సాధారణంగా రక్తం సూపర్‌ఫిషియల్‌ వెయిన్స్‌(ఉపరితల సిరలు) నుంచి డీప్‌ వెయిన్స్‌కు సరఫరా అవుతుంది. అక్కడ నుంచి రక్తం గుండెకు అవుతుంది. కానీ ఈ ప్రక్రియ విఫలమైనప్పుడు రక్తం ఉపరితల సిరల్లోనే నిలిచిపోతుంది. దీంతో సిరలు ఉబ్బిపోయి వెరికోస్‌ వెయిన్స్‌కు దారితీస్తుంది.

కారణాలు

సిరల్లోని కవాటాల్లో లోపం, సిరల్లో అవరోధం మూలంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఎవరిలో ఎక్కువ? వయసు పైబడిన వారిలో, స్త్రీలలో, స్థూలకాయుల్లో, వ్యాయామం చేయని వారిలో వెరికోస్‌ వెయిన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. స్థూలకాయం: రక్తనాళాల్లో కొవ్వు ఎక్కు వగా పేరుకుపోవడం మూలంగా సిరలకు తగినంత తోడ్పాటు లభించదు. ఫలితంగా వెరికోస్‌ వెయిన్స్‌కు దారితీస్తుంది.
ప్రెగ్నెన్సీ: ఎక్కువ సార్లు గర్భం ధరించిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ప్రొజెస్టిరాన్‌ అధిక మొత్తంలో విడుదల కావడం వల్ల సిరల పనితీరు తగ్గిపోతుంది. గర్భం ధరించిన స్త్రీలలో గర్భాశయం ఇన్‌ఫెరియర్‌ వీన్‌పై ఒత్తిడి కలగజేయడం వల్ల వీనస్‌ సిస్టమ్‌లో ఒడిదుడుకులు ఏర్పడతాయి. 
వయసు పైబడటం: వయసు పైబడటం వల్ల రక్తనాళాల్లో కవాటాలు దెబ్బతిని, సిరలు పనిచేయలేని స్థితి తలెత్తుతుంది.  ఎక్కువ సేపు నిలబడటం: ఎక్కువ సేపు నిలబడటం వల్ల కాలి పిక్కల దగ్గర ఉన్న కండరాలు పనిచేయడం మానేస్తాయి. పంపింగ్‌ మెకానిజం రక్తాన్ని పైకి పంపించలేకపోతుంది. ఫలితంగా వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య ఉత్పన్నమవుతుంది. 

ముఖ్య లక్షణాలు

సిరలు ముదురు నీలం రంగులో, చర్మం కింద ఉబ్బిపో యి, మెలిపడి కనిపిస్తుంటా యి. కాలు బరువుగా ఉం టుం ది. కాలి పిక్కల దగ్గర నొ ప్పి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడై తే వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య ఉందో అక్కడ నొప్పి తీవ్రంగా ఉంటుంది. నడుస్తున్నప్పుడు నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పడుకున్నప్పుడు కాలి పిక్కలు పట్టేయడం జరుగుతుంది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా నిలుచున్నప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. వెరికోస్‌ వెయిన్స్‌ ఉన్న ప్రాంతంలో దురద, చర్మం రంగు మారుతుంది. వాపు, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కాలు వాయడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. డీప్‌వెయిన్స్‌లో బ్లాక్‌ ఉన్నట్లయితే దాన్ని డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌.

ప్రధాన సమస్యలు

పిగ్మెంటేషన్‌, క్రానిక్‌ డెర్మటైటిస్‌, వీనస్‌ అల్సరేషన్‌, థ్రాంబోఫెలిబిటిస్‌, కాల్సిఫికేషన్‌, చీలమండలో మంట, ఎర్రగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
రోగ నిర్ధారణ
రోగిని ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌ చేయడం ద్వారా వెరికోస్‌ వెయిన్స్‌ నిర్ధారణ చేయవచ్చు. ఇందుకోసం ట్రెండెలెన్‌బర్గ్‌ టెస్ట్‌, టార్నిక్విట్‌ టెస్ట్‌లు బాగా ఉపయోగపడతాయి. 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
అధిక బరువు ఉంటే తగ్గించు కోవడం, వ్యాయామం చేయడం, కూర్చున్నప్పుడు కాలు ముడు చుకోకుండా, చాపి పెట్టుకోవడం ద్వారా వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. వదులు దుస్తులు ధరించడం, ఎక్కువ సేపు నిలబడకుండా ఉండటం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయి.

హోమియో చికిత్స

లక్షణాల తీవ్రత ఆధారంగా చేసుకుని శారీరక, మానసిక అంశాలను పరిశీలించి  కాన్‌స్టిట్యూషనల్‌ హోమియో మందులను ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మూలకారణాన్ని తొలగించే విధంగా చికిత్స ఉంటుంది. కాబట్టి వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఎటువంటి దుష్పభావాలు ఉండవు. సల్ఫర్‌, కార్డస్‌, ఎసిటిక్‌ యాసిడ్‌, ఎపిస్‌, జిండ్‌ మెట్‌ వంటి మందులు చికిత్స బాగా ఉపయోగపడతాయి. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే వెరికోస్‌ వెయిన్స్‌ నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. 
 
డాక్టర్‌ జి. పవన్‌రెడ్డి
జెనెటిక్‌ హోమియోపతి
కొండాపూర్‌ - దిల్‌సుఖ్‌నగర్‌
హైదరాబాద్‌
ఫోన్‌: 8125 108 108
        8019 108 108