హోమియోతో లైంగిక, నరాల సమస్యలు దూరం

08-04-13

 
షుగర్‌ వ్యాధి ప్రభావం దాంపత్య జీవితంపై కూడా ఉంటుంది. షుగర్‌ వ్యాధితో దీర్ఘ  కాలంగా బాధపడుతున్నా, షుగర్‌ లెవెల్స్‌  అదుపులో లేకపోయినా అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలనం, ఇతర నరాల సమస్యలు వచ్చిపడతాయి. శృంగార సమస్యలు ప్రారంభం కావడంతోనే మానసిక అశాంతి మొదలవుతుంది. అయితే షుగర్‌ వ్యాధి వల్ల వచ్చే ఈ సమస్యలను హోమియో చికిత్స తీసుకోవడం ద్వారా                                  అధిగమించవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి.
 
డయాబెటిస్‌ వ్యాధితో దీర్ఘకాలం బాధపడినపుడు అనేక సమస్యలు మొదలవుతాయి. అందులో డయాబెటిక్‌ న్యూరోపతి, అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలనం, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు వంటివి ప్రధానమైనవి. షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వారిలో 60 నుంచి 70 శాతం మందిలో నరాల సమస్యలు ఏర్పడతాయి. 
అంగస్తంభన సమస్యలు
షుగర్‌ వ్యాధి దీర్ఘకాలం ఉన్నప్పుడు సాధారణంగా తలెత్తే సమస్య అంగస్తంభనలు తగ్గిపోవడం. షుగర్‌ లెవెల్స్‌ అదుపులో లేకపోవడం, అదుపులో ఉన్నా వ్యాధితో దీర్ఘకాలం బాధపడినపుడు అంగస్తంభన సమస్యలు మొదలవుతాయి. అంగంలో చలనం లేకపోవడం, రక్తప్రసరణలో జరిగే మార్పుల వల్ల అంగం స్తంభించకపోవడం జరుగుతుంది. వీటితో పాటు వీరిలో మానసిక ఆందోళన, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు ఎక్కువగా ఉండటం వల్ల శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బందిపడతారు. ఈ సమస్య వయసు పైబడిన వారిలోనే కాకుండా యువకుల్లోనూ కనిపిస్తోంది. 
శీఘ్రస్ఖలనం
శృంగారంలో మధురానుభూతులు అందకముందే వీర్యస్ఖలనం జరిగిపోతుంటుంది. దీనివల్ల భాగస్వాములిద్దరికీ సంతోషం లేకుండా పోతుంటుంది. దాంపత్య జీవితంపై దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది. మానసిక అశాంతికి కారణమవుతుంది. ఈ సమస్యకు మానసిక ఆందోళన, డిప్రెషన్‌, పొగతాగడం, మద్యంసేవించడం, డయాబెటిస్‌ వ్యాధి ఉండటం ముఖ్యకారణాలుగా చెప్పుకోవచ్చు. శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్న వారిలో సెక్స్‌ కోరికలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు శృంగారం జరిపే సమయంలో త్వరగా వీర్యస్ఖలనం జరుగుతుంటుంది. కొన్ని సమయాల్లో రతిలో పాల్గొన్న సెకన్లలోనే వీర్యం పడిపోతుంది. వీరిలో అంగస్తంభన సమస్య లేకపోయినప్పటికీ శీఘ్రస్ఖలనం సమస్య ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో డయాబెటిక్‌ న్యూరోపతితో పాటు ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 
హెర్పిస్‌
ఇది అతిముఖ్యమైన, సాధారణమైన సమస్యగా చెప్పుకోవచ్చు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొక రికి సంక్రమిస్తుంది. హెర్పిస్‌తో బాధపడుతున్నవ్యక్తితో శృంగారంలో పాల్గొన్నప్పుడు భాగస్వామికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి బారినపడిన వారిలో అంగంపైన చిన్న చిన్న గుళ్లలు ఏర్పడతాయి. ఇవి ఎరుపు రంగులో లేదా తెలుపు రంగులో ఉంటాయి. దురద, మంట ఉంటుంది. ఈ వ్యాధి క్రమేపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా వేడిపదార్థాలు తీసుకున్నట్లయితే హెర్పిస్‌ పెరగుతుంది. 
నరాల సమస్యలు
డయాబెటిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్నవారిలో ప్రధానంగా తలెత్తే సమస్య డయాబెటిక్‌ న్యూరోపతి. నరాలకు సంబంధించిన ఈ వ్యాధి శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ శాతం పెరిగి, ఆ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినపుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. న్యూరోవాస్కులర్‌ కారణాల వల్ల కూడా ఆక్సిజన్‌ను, ఇతర పోషకాలను సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతింటాయి. 
లక్షణాలు
అరచేతుల్లో, పాదాలలో తిమ్మిర్లు, పాదాలలో నొప్పి, మంటలు వంటి లక్షణాలుంటాయి. చేతులు, భుజాలు, కాళ్లు, వేళ్లలో నొప్పి ఉంటుంది. కొందరిలో అజీర్ణం, వాంతులు, డయేరియా, మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి. డయాబెటిక్‌ న్యూరోపతి బారిన పడిన వారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు, శారీరక పరీక్షల ద్వారా న్యూరోపతిని నిర్ధారించవచ్చు. రక్తపోటు, గుండె లయలో వేగం, కండరాల పటుత్వం తదితర పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధిని తెలుసుకోవచ్చు.
హోమియో చికిత్స
హోమియో చికిత్స  వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచడమే కాకుండా కొన్నిసార్లు పూర్తిగా నివారించడం సాధ్యమవుతుంది. ఎప్పుడయితే షుగర్‌ లెవెల్స్‌ను అదుపులో పెడతామో అప్పుడు శృంగార సమస్యలు దూరమవుతాయి. అస్నన్‌కాకస్‌, స్పఫెసాగ్నిరియా, లైకోపోడియం, సెలెనియం వంటి మందులు చికిత్సలో బాగా ఉపయోగపడతాయి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే డయాబెటిస్‌ రోగుల్లో వచ్చే శృంగార సమస్యలన్నీ తొలగిపోతాయి. 

డా. యస్‌. చంద్రశేఖర్‌రెడ్డి 
డైరెక్టర్‌ అండ్‌ సీనియర్‌ ఫిజీషియన్‌
మాస్టర్స్‌ హోమియోపతి
ఫోన్‌ : 7842 106 106
         9032 106 106