హోమియో వైద్యంతో ఆర్థరైటిస్‌కు సమస్యలు దూరం

 

ఆంధ్రజ్యోతి, 30-04-13:
 
కీళ్లలో నొప్పులు, వాపు, కాళ్లు బిగదీసుకుపోవడం...అడుగు తీసి అడుగువేయాలంటే భరించలేని వేదన...ఇవన్నీ ఆర్థరైటిస్‌ కారణంగా ఏర్పడే బాధలు. కండరాలు, ఎముకల వ్యవస్థను ముఖ్యంగా కీళ్లను దెబ్బతీసే వ్యాధుల సమూహమే ఆర్థరైటిస్‌. హోమియో వైద్యంతో ఆర్థరైటిస్‌ సమస్యలను  శాశ్వతంగా పరిష్కరించవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు  డాక్టర్‌ కె. రాజశేఖర్‌రెడ్డి.  
 
ఆర్థరైటిస్‌ వల్ల కీళ్లలోని కార్టిలేజ్‌లో మార్పులు ఏర్పడతాయి. మన శరీరంలోని ఎముకల చివర్లలో ఉండే కార్టిలేజ్‌ కుషన్‌లాగా పనిచేస్తూ కీళ్ల కదలికలను మెత్తగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసేలా చేస్తుంది. ఆర్థరైటిస్‌ కారణంగా కార్టిలేజ్‌ దెబ్బతిని ఎముకల మధ్య రాపిడికి లోనుచేస్తుంది. దీంతో కీళ్ల కదలికలు ఇబ్బందికరంగా మారతాయి. హోమియో మందులు వాడుతూ, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య కానేకాదు.కారణాలు
పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికం. ఈ వ్యాధి ఏ వయసులోనైనా మొదలుకావచ్చు..అయితే 40-60 మధ్య వయస్కులలో వచ్చే అవకాశాలు ఎక్కువ.
 గాయాల కారణంగా ఎముక, లిగమెంట్‌, కార్టిలేజ్‌ దెబ్బతిని తీవ్రమైన నొప్పికి దారితీయవచ్చు. కీళ్లకు ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఆర్థరైటిస్‌ రావచ్చు. స్థూలకాయం, వృద్ధాప్యం వల్ల రావచ్చు. కీళ్లను అతిగా ఉపయోగించే వారిలో ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు అధికం.హఠాత్తుగా జరిగే కదలికల వల్ల కీళ్లు పట్టేసి కదలికలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎముకలు పక్కకు జరిగినపుడు కూడా  రావచ్చు.
లక్షణాలు
వివిధ రకాల ఆర్థరైటిస్‌కు వేర్వేరు వ్యాధి లక్షణాలు ఉంటాయి. అయితే సాధారణంగా ఆర్థరైటిస్‌ రోగులలో కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు. కీళ్లలో వాపు, కీళ్లు బిగుసుకుపోవడం, కీళ్లలో నొప్పి, వేడిగా ఉండడం, కీళ్ల కదలికలు నిలిచిపోవడం, కీళ్లను కదల్చాలంటే తీవ్రమైన నొప్పి, కరకర శబ్దాలు వినపడడం, కీళ్ల చుట్టూ ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించడం, అడుగు తీసి అడుగు వేయలేకపోవడం, తరచు జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం, బలహీనంగా ఉండడం మొదలైనవి కనిపించే కొన్ని లక్షణాలు.
ఆర్థరైటిస్‌లో రకాలు
ఆర్థరైటిస్‌లో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, గౌట్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌, సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌, స్పాండిలైటిస్‌ వంటివి ప్రధానమైనవి.
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌: శరీరంలో జీవక్రియలలో ఏర్పడే అసమతుల్యత కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ కారణంగా కీళ్ల వద్ద వాపు ఏర్పడి అది కార్టిలేజ్‌కు, ఎముకకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒకేసారి రెండు కీళ్లకూ వచ్చే అవకాశాలు ఎక్కువ(ఉదాహరణకు రెండు చేతుల మణికట్టుకు).
లక్షణాలు: రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఏర్పడినపుడు కీళ్లలో వాపు, నొప్పి ఉంటాయి. ఇది ఎక్కువగా చేతి మణకట్టు, చేతి వేళ్లు, మోకాలి కీళ్లకు ఎక్కువగా వస్తుంది. పిల్లలలో ఈ వ్యాధి వచ్చినపుడు చలితో కూడిన జ్వరం, కీళ్లలో నొప్పులు, లేత ఎరుపురంగు మచ్చలు కీళ్ల దగ్గర ఏర్పడటం కనిపిస్తుంది.
గౌట్‌: శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ అధికంగా తయారై అది చిన్న చిన్న రాళ్ల రూపంలో కీళ్ల వద్ద చేరుతుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో వాపు, భరించలేని నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మోకాలు, చేతి మణికట్టు, కాలి వేళ్లకు ఏర్పడుతుంది. జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల మందులు ఈ వ్యాధికి దారితీస్తాయి.
లక్షణాలు: సాధారణంగా గౌట్‌ వ్యాధిగ్రస్తులలో నొప్పి అర్థరాత్రి హఠాత్తుగా మొదలవుతుంది. పాదాలు, వేళ్లు, మోకాలు, చేతులు, మణికట్టు ప్రాంతాలలో ఈ సమస్య ఏర్పడుతుంది. నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. నొప్పి తగ్గిన తర్వాత కీళ్ల కదలికలు కొన్ని రోజుల పాటు ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాధికి గురైన కీళ్ల వద్ద వాపు ఉంటుంది. ఎర్రగా అక్కడ కమిలిపోతుంది.
ఆస్టియోఆర్థరైటిస్‌: ఇది సర్వసాధారణంగా వయసు పైబడినవారిలో కనిపించే సమస్య. కీళ్లలో అరుగుదల కారణంగా ఇది తలెత్తుతుంది. కార్టిలేజ్‌ దెబ్బతిని కీళ్లు బయటకు పొడుచుకువస్తాయి. దీంతో కీళ్ల కదలికలు నిలిచిపోతాయి. సాధారణంగా ఈ సమస్య బరువును మోసే తుంటి, మోకాలు, నడుము, వెన్ను, పాదాలు తదితర భాగాలలోని కీళ్లలో ఏర్పడుతుంది. జీవక్రియ అసమతుల్యత, వయసు పైబడడం, ఒబేసిటి, వంశపారంపర్యత కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది.
సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌ : చర్మం ఎర్రగా మారటంతోపాటు మెడ, మెకాళ్లు, గోళ్లు ఎరుపు రంగులోకి రావటాన్ని సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌ అంటారు. స్పాండిలైటిస్‌ సమస్య ఏర్పడినపుడు వెన్ను సమస్యతో మెడ నొప్పి వస్తుంది. 
హోమియో వైద్యం
హోమియో వైద్యం రోగ లక్షణాలతోపాటు రోగి ఆరోగ్య చరిత్ర, వంశపార్యంపర్యత వంటి అన్ని అంశాలను ఆధారంగా చేసుకుని రోగ మూలాలను నిర్ధారించుకుని చేసే విశిష్టమైన చికిత్స. రోగి శారీరక, మానసిక పరిస్థితులను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని చికిత్స చేపట్టడం జరుగుతుంది. కాల్కెరియా ఫాస్పెరికమ్‌, కాలి సల్ఫ్‌, బ్రియోనియా, మాగ్నేషియం కార్బ్‌, సల్ఫర్‌, సిలీషియా, నాట్రమ్‌ సల్ఫ్‌, పల్సటిల్లా వంటి హోమియో మందులు ఆర్థరైటిస్‌ను సమూలంగా, శాశ్వతంగా నయం చేయడంలో బాగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.
 
డా. కె. రాజశేఖర్‌రెడ్డి
జెనెటిక్‌ హోమియోపతి
కొండాపూర్‌,
దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 8125 108 108
         9133 180 108