18-07-2018: సంతానం కలగని దంపతుల్లో పురుషుడు, స్త్రీకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు (పురుషునికి సంబంధించి వీర్య పరీక్ష, స్త్రీ కి సంబంధించి అండం విడుదల, ఫాలోపియన్ నాళ పరీక్ష) ముగిసిన తరువాత కూడా ఇతమిద్ధంగా కారణాలు తెలియకపోతే దానిని ‘‘తెలియని కారణాల వల్ల వచ్చే సంతానలేమి’’గా భావించవచ్చు. ప్రపంచంలో తెలియని కారణాల వల్ల సంతానలేమితో భాదపడేవారు పదిహేను శాతం వరకు ఉన్నట్లు అంచనా.
అంతుచిక్కని కారణాలు ఇలా ఉండవచ్చు:
స్త్రీలలో అండం ఫలదీకరణకు అనువైన సమయంలో విడుదల కాకపోవడం
విడుదలయిన అండం ఫాలోపియన్ నాళంలోకి ప్రవేశించకపోవడం
శుక్ర కణాలు అండాన్ని చేరుకోకపోవడం. లేదా ఫలదీకరణం చెందిన పిండం గర్భాశయ గోడలకు అతుక్కోకపోవడం.
ఎక్కువ వయసు ఉన్న స్త్రీ అండాలు తక్కువ ఫలదీకరణ సామర్ధ్యం కలిగి ఉండడం.
ఒక్కోసారి స్త్రీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఫలదీకరణ జరిగిన పిండాన్ని అంగీకరించలేకపోవడం.
ఈ కారణాలను సాధారణ వైద్య పరీక్షల్లో నిర్థారించలేం.
పరిష్కార మార్గాలు- హోమియోపతి చికిత్స
సాధారణంగా ఇటువంటి సమస్యలను సరైన విధంగా అవగాహన చేసుకుని తదనుగుణంగా పరిష్కారం కనుగొనవచ్చు.
ముఖ్యంగా స్త్రీ, పురుషులు సంతాన సాఫల్యత గురించిన అవగాహన, అండం విడుదల గురించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి.
సరైన పౌష్ఠికాహారం, వ్యాయామం ద్వారా శుక్రకణాలు, అండం నాణ్యత పెరిగే అవకాశాలుంటాయి. తద్వారా ఫలదీకరణ సామర్ధ్యం పెరుగుతుంది.
హోమియోపతి చికిత్స:
ఇలాంటి సమస్యలకు హోమియోపతిలో అద్భుతమైన ఔషధాలు, చికిత్సా మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి అంతుచిక్కని సమస్యలను వ్యక్తి శారీరక- మానసిక లక్షణాలు, వాటి పూర్వాపరాలు పూర్తిగా విశ్లేషించి వైద్యులు ఔషధాలు సూచిస్తుంటారు. కనుక పురుషుల్లో శుక్ర కణాల నాణ్యత (అండాన్ని త్వరగా ఫలదీకరించే సామర్థ్యం), అలాగే స్త్రీలలో అండ నాణ్యత పెరిగి తద్వారా ఫలదీకరణ జరిగే అవకాశాన్ని మెరుగుపరుస్తుంది.
స్త్రీలకు: పల్మటిల్లా, సెపియం, కాల్కేరియం, లాకసిస్ లాంటి మందులను వాటి లక్షణాలను బట్టి వాడవచ్చు.
పురుషులకు: లైకోపోడియం, బరైటాకార్ట్, ఆసిడ్ఫాస్, నాట్రం మూర్ లాంటి మందులను వాడవచ్చు. అయితే ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణలో పూర్తి విశ్లేషణ అనంతరం వాడితేనే ప్రయోజనం ఉంటుంది.
-డాక్టర్ కె.శ్రీనివాస గుప్తా, ఎం.డి. హోమియో స్టార్ హోమియోపతి
సికింద్రాబాద్, కొత్తపేట, కూకట్పల్లి, హనుమకొండ, వైజాగ్, విజయవాడ, తిరుపతి,
రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు మరియు కర్ణాటక. ఫోన్ నంబర్: 9246800011
www.starhomeopathy.com