హార్మోన్స్‌ సమస్యలకు హోమియో పరిష్కారం

19-06-2018: మనిషి జీవించటానికి శ్వాస ఎంత ముఖ్యమో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండముగా ఏర్పడినప్పటి నుంచి మనిషి కాలం తీరేంతవర కు శరీరము మీద హార్మోన్ల ప్రభావము ఉంటుంది.
శరీరంలోని ఒక కణము నుంచి మరొక కణానికి రసాయనిక సమాచారం అందజేసే, సంకేతాలను తెలిపే కెమికల్స్‌ను హార్మోన్లు అంటారు. మెదడు భాగంలోని హైపోథాలమస్‌ మరియు పిట్యూటరి గ్రంధి హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడి శరీరంలోని కణాల క్రమబద్ధతకు ప్రాముఖ్యత వహిస్తాయి. ఈ హార్మోన్లు శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితిని, నిద్రను, దాహము, కామక్రోధమును అదుపులో ఉంచుతాయి. ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్‌, సిసిఒడి, సంతానలేమి, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్‌ అసమతుల్యత వల్ల వచ్చేవి. చాలా రకాల హార్మోన్లు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. హార్మోన్లు పాలిపెప్టైడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుంచి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్ధిష్ట అవయవాలను ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడతాయి. ఈ హార్మోన్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. ఈ హార్మోన్లు ఎండోక్రైన్‌, ఎక్సోక్రైన్‌ గ్రంధుల నుంచి ఉత్పత్తి అవుతాయి. శరీరంలో ఇవి సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎగుదుదల, మానసిక సమతుల్యత జీవక్రియలకు తోడ్పడతాయి. థైరాయిడ్‌ హార్మోన్ల టి3, టి4 ఇవి థైరాయిడ్‌ గ్రంధి నుంచి ఉత్పత్తవుతాయి. వాటి అసమతుల్యత వల్ల హైపోథైరాయిడ్‌, హైపర్‌థైరాయిడ్‌, గాయిటర్‌ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి.
 
స్త్రీలలో హార్మోన్స్‌ సమస్యలు
ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు స్త్రీలలో నెలసరి, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల స్ర్తీలలో నెలసరి సమస్యలు, అవాంచిత రోమాలు, సంతానలేమి, సమస్యలు వస్తాయి. స్రీలలో మెనోపాజ్‌, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం కీళ్లనొప్పులు వస్తాయి.
 
పురుషుల్లో హర్మోన్‌ సమస్యలు
మగవారిలో ముఖ్యంగా టెస్టోస్టిరాన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అయి ఎముకల సాంద్రతకు, కండరాల పటుత్వానికి, వీర్యకణాల వృద్ధికి దోహద పడుతుంది. ఈ టెస్టోస్టిరాన్‌ లోపం వల్ల సెక్స్‌ప్రోబ్లమ్స్‌, కండరాల పటుత్వం తగ్గిపోవటం, డిప్రెషన్‌, టైప్‌ 2 డయాబెటిస్‌ అంతేకాక ఎల్‌హెచ్‌ మరియు ఎఫ్‌ఎస్‌హెచ్‌ డెఫీషియెన్సీ వలన హై పోగొనాజిజమ్‌ వచ్చే అవకాశం ఉంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ అసమతుల్యత వల్ల శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, వీర్యకణాల లోపాలు, సంతానలేమి సమస్యలు వస్తాయి. పిల్లల బరువు, ఎత్తు, ఎదుగుదల సమస్యలు వస్తాయి.
 
హోమియో చికిత్స
హార్మోన్ల ప్రభావము శరీరము మీద ఎంతో ఉంది. థైరాయిడ్‌ సమస్యలతో బాధపడేవారు జీవితాంతము మందులు వాడాల్సివస్తుందని వాపోతుంటారు. అంతేకాక మందులు మానేయటం వలన సమస్య పెరిగే అవకాశం ఉంది. థైరాయిడ్‌ సమస్య కాకుండా ఇతర హార్మోన్ల సమస్యలను తొలగించడానికి ఇప్పుడు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. హోమియోపతిలో రోగి యొక్క శారీరక, మానసిక, అనువంశిక,
వంశపారంపర్య తత్వాలను విశ్లేషించి చికిత్స చేయటం జరుగుతుంది. ఉదాహరణ థైరాయిడ్‌కు లక్కేరియా కార్బ్‌, థైరాడిసమ్‌ ఐమోటమ్‌, బ్రోమియమ్‌, సల్ఫర్‌ మరియు ఇతర సమస్యలకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్‌ పర్యవేక్షణలో వాడాలి. తద్వారా వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు.
- డాక్టర్‌ కె.శ్రీనివాస గుప్తా, ఎం.డి హోమియో
స్టార్‌ హోమియోపతి
సికింద్రాబాద్‌, ఫోన్‌ నంబర్‌: 9246800011