మానసిక సమస్యలకు హోమియో మేలు

ఆంధ్రజ్యోతి, 27-01-2012: ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాక డిప్రెషన్‌ బారిన పడే వారి సంఖ్య పెరిగింది. బాధలను తమలోనే దాచుకుంటూ ఎప్పుడూ ఆలోచనలతో డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, సలహాలిచ్చే ఆప్తులు లేకపోవడంతో ఈ సమస్య రెట్టింపవుతోంది. అయితే డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి హోమియో మందులు చక్కగా ఉపయోగపడతాయంటున్నారు హోమియో వైద్యులు డా. రవికిరణ్‌ 

ఉరుకుల పరుగుల జీవితం, అన్ని రంగాల్లోనూ పోటీతత్వం. పరుగెత్తకపోతే ఎక్కడ వెనుకబడిపోతామోననే భయం. ఓటమిని ఎదుర్కొనే దైర్యం మచ్చుకైనా కనిపించదు. ఎవరిని చూసినా ఎదో తెలియని వెలితితో ఉంటారు. దీనికంతటికీ కారణం అభద్రత, అసంతృప్తి. ఆధునిక సమాజంలో ఇది మరింత ఎక్కువనడంలో సందేహం లేదు. తనకుతానుగా సమస్యలు కొనితెచ్చుకుని డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నాడు. ఈ మానసిక వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
 
డిప్రెషన్‌కు లోనయితే.... 
వ్యక్తి బయపడినపుడు హావభావాలు మారిపోతాయి. కొన్ని లక్షణాల ఆధారంగా వ్యక్తి భయపడుతున్నాడనే విషయాన్ని తెలుసుకోవచ్చు. నోట్లో తడి ఆరిపోతుంది. నాలుక పిడచ కడుతుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. విరేచనాలు అవుతాయి. మూత్రం ఎక్కువగా వస్తుంది. తల తిరుగుతుంది. ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నిద్ర పట్టదు. ఏకాగ్రత దెబ్బతింటుంది. చికాకు, కోపం వస్తాయి. ఈ లక్షణాలన్నీ మనిషిని కుంగదీస్తాయి. కుటుంబ సమస్యలకు దారితీస్తాయి.
 
కారణాలెన్నో... 
మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఇప్పుడు తక్కువేం కాదు. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా సంఘంలో అభద్రతా భావం పెరగడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లైంగిక సమస్యలు, పని ఒత్తిడి, పరస్పర అవగాహన లోపించడం వంటివి వ్యక్తిలో భయం పెరగడానికి తద్వారా డిప్రెషన్‌లోకి జారుకోవడానికి కారణాలవుతున్నాయి. యువత తర్వాత ఎక్కువగా డిప్రెషన్‌కు గురయ్యేవారిలో విద్యార్థులు ఉంటున్నారు. దీనికి సామాజికాంశాలే కారణాలు. తమ పిల్లలు అందలం ఎక్కాలన్న కాంక్షతో పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాలల్లో స్థాయికి మించిన కోర్సులను చదువమని ఒత్తిడి పెడుతున్నారు. ర్యాంకుల పోటీలో భంగపడ్డ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. ఇవన్నీ ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి దారితీస్తున్నాయి.
 
చికిత్స 
డిప్రెషన్‌ మూలంగా మదిలో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. చికాకు ఉంటుంది. నిద్రపట్టదు. దీని ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతుంది. గ్యాస్ర్టిక్‌ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు పరిష్కరించాలంటే ముందు వ్యక్తి మానసిక స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అతని ఆలోచనా విధానాలను ఓపికగా వినాలి. విమర్శలకన్నా ప్రోత్సాహం అవసరం. అతని మీద అతనికి నమ్మకం కలిగించేలా కౌన్సెలింగ్‌ చేయాలి. అతిగా మందులు వాడటం కన్నా రోగి వ్యవహరించే తీరు, ఓర్పు, నేర్పు, సహనం పరీక్షించాలి. మానసిక స్థితిపై ఆధారపడి పనిచేసే చికిత్సా విధానం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ తరహా వైద్య విధానం హోమియోపతి వల్లే సాధ్యమవుతుంది. మాన సికంగా బాధపడుతున్న వ్యక్తులను దారిలో పెట్టడమే కాదు, అనుకోకుండా వచ్చిన దురలవాట్లను కూడా మాన్పించడం ఈ వైద్య విధానం వల్ల సాధ్యమవుతుంది.
 
హోమియో మందులు 
ఆర్సెనిక్‌ అల్బ్‌ : ఎపడూ భయపడే వ్యక్తులు, ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వచ్చే వాళ్లు ఈ మందు తీసుకోవచ్చు. ఆహారం జీర్ణం కాని వ్యక్తులకు ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. 
ఇగ్నిషీయా : ఘర్షణ వల్ల మానసికంగా కుంగిపోయే వ్యక్తులు, ప్రతి చిన్న విషయానికి బాధపడే స్వభావం ఉన్నవాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది. మానసికంగా కుంగిపోయే సీ్త్రలకు ఇది మంచి మందు. 
స్లాఫి సాగ్రియా : అస్థిరమైన ఆలోచనలతో మధనపడేవాళ్లు, ఊహాప్రపంచంలో బతికేవాళ్లు, ఎదుటివాళ్ల కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడలేని స్వభావం ఉన్న వ్యక్తుల డిప్రెషన్‌ తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. 
ఓపియం : నిద్రలేమి సమస్యతో బాధపడేవాళ్లకు ఇది దివ్యౌషధం. గాఢమైన నిద్ర కాకుండా, శరీరానికి కావల్సిన మేర నిద్రపట్టేట్టు చేస్తుంది. 
హైసోస్టిమా : అనవసర ఆలోచనలతో నిద్రపట్టక, మానసిక ఒత్తిడికి గురయ్యే వాళ్లు ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు. 
కాలిఫస్‌ : మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తి ఈ మందు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. 
డిప్రెషన్‌కు లోనవుతున్న వారు అనుభవజ్ఞులైన హోమియో వైద్యుణ్ని కలిసి చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. 

డాక్టర్‌ రవికిరణ్‌ 
ఎండి(హోమియో) 
డైరెక్టర్‌ అండ్‌ సీనియర్‌ ఫిజీషియన్‌ 
మాస్టర్స్‌ హోమియోపతి 
ఫోన్‌ : 7842 106 106 
9032 106 106