ఎస్‌ఎల్‌ఈ వ్యాధికి ‘హోమియోకేర్‌’

 

09-11-2018: ఎస్‌ఎల్‌ఈ ఒక ఆటోఇమ్యూన్‌ వ్యాధి. మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడే రోగనిరోధక వ్యవస్థ పొరబడి, మన సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల ఏర్పడే వ్యాధులను ‘ఆటోఇమ్యూన్‌ వ్యాధులు’ అంటారు. దీని వల్ల మన శరీరంలోని అనేక అవయవాలు వ్యాధికి గురవుతాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కీళ్ళు, చర్మం, రక్త నాళాలు, నాడీ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. 15 నుండి 35 సంవత్సరాల లోపు స్త్రీలలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి దశను ఊహించడం కష్టం. కొన్ని రోజులు తీవ్రంగానూ (ఫ్లేర్‌ అప్స్‌), మరికొన్ని రోజులు వ్యాధి లక్షణాలు తక్కువ కావడం (రెమిషన్‌) జరుగుతుంది.
 
కారణాలు: జన్యుపరమైన, పర్యావరణ కారణాలతో పాటు మానసిక ఒత్తిడి వలన కూడా ఈ వ్యాఽధి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
లక్షణాలు: అవయవాన్ని బట్టి ఆయా లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
చర్మము: ముఖంపై, బుగ్గలు, ముక్కుపైన సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు వస్తుంటాయి. దీనినే బటర్‌ఫ్లై రాష్‌ అంటాము.
డిస్కాయిడ్‌ లూపస్‌: చర్మం ఎర్రబడటం, పొలుసులు రాలటం, చర్మపు లోపలి పొరలలో నుండి దళసరి పగుళ్ళు, రక్తస్రావంతో కూడిన పొలుసులు రాలటం, నల్లటి మచ్చలు రావట వంటివి జరుగుతాయి.
మూత్రపిండాలు: మూత్రంలో రక్తకణాలు, ప్రోటీన్లు కోల్పోతారు. శరీరమంతా వాపులు రావడంతో పాటు బరువు పెరుగుతారు. ఎస్‌ఎల్‌ఈ వ్యాధి దీర్ఘకాలం కొనసాగితే మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి డయాలసిస్‌ గానీ మూత్రపిండాల మార్పిడి గానీ చేయవలసిన అవసరం ఉండవచ్చు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
గుండె: ఎస్‌ఎల్‌ఈ రోగులలో గుండెకు సంబంఽధించిన సమస్యలతో మరణించే వారి సంఖ్య అధికం.
ముఖ్యంగా పెరికార్డయిటిస్‌, మయోకార్డయిటిస్‌, ఎండోకార్డయిటిస్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీని వలన ఆయాసం, జ్వరం, నీరసం వంటివి రావచ్చు.
కండరాలు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఎస్‌ఎల్‌ఈ సాధారణంగా అనేక కీళ్ళను, ముఖ్యంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తుంది. 
రక్తహీనత, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గటం వంటివి జరుగుతాయిఫఊపిరితిత్తులలో నిమ్ము చేరుతుంది.
పిండ మరణం, గర్భస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంటుంది.
వ్యాధి నిర్థారణ పరీక్షలు: సీబీపీ, సీయూఈ, ఈఎస్‌ఆర్‌, రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ , సీ- రియాక్టివ్‌ ప్రొటీన్‌, (సీఆర్‌పీ) ఫ యాంటీ న్యూక్లియర్‌ యాంటీబాడీస్‌ (ఏఎన్‌ఎన్‌) ఫ యాంటీ ఎస్‌ఎం యాంటీబాడీస్‌ , యాంటీ డీఎస్‌ డీఎన్‌ఏ, ఇతర పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్థారించవచ్చు.
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ వైద్యం: సాధారణంగా ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్‌ లూపస్‌ ఎరితిమాటోసిస్‌) వ్యాధికి అనేక చికిత్సా పద్ధతులు ఉన్నప్పటికీ సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఎందులోనూ లేదు. కానీ ‘హోమియోకేర్‌’లో అందించే అధునాతన జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ చికిత్సా విధానంలో రోగి మానసిక, శారీరక తత్వాలను క్షుణ్ణంగా విచారించి, సరిపడిన మందులను అందించడం జరుగుతుంది. తద్వారా ఎస్‌ఎల్‌ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచే అవకాశం ఉంది.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ ఇకఈ
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి