సయాటికాకు హోమియోకేర్‌

02-08-2018: ఈ ఆధునిక కాలంలో ‘సయాటికా’ గురించి వినని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో సయాటికా బారిన పడే వారు 70 శాతం వరకూ ఉంటారు. ముఖ్యంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వారిలో దీనిని గమనించవచ్చు. స్త్రీలలో, పురుషుల్లో ఈ వ్యాధి సమాన స్థాయి ఉంటుంది.
 
శరీరంలో అతి పెద్ద నరం అయిన సయాటికా నరం అయిదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది. ఈ సయాటికా నరం కాళ్లు మరియు పాదాల పనితీరును వాటి స్పర్శను నియంత్రిస్తుంది. ఈ నరాలపైన, ముఖ్యంగా సయాటికా నరంపై ఒత్తిడి పడుతోందో దాన్నే సయాటికా నొప్పి అంటాం.
 
కారణాలు
హెర్నియేటడ్‌ డిస్క్‌: దీన్నే డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటారు. వెన్నుపూసల మఽధ్యలో డిస్క్‌లు మృదులాస్థితిని కలిగి ఉంటాయి. ఇవి ఒత్తిడిని తట్టుకొనే షాక్‌ అబ్జార్బర్లుగా పని చేస్తాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ డిస్కులు బలహీనపడి, డిస్క్‌ అంచు అంటే ఆన్యులస్‌ ఫ్రైబ్రోసిస్‌ చిరిగి లోపల ఉండే మెత్తగా జిగురు- ‘న్యూక్లియస్‌ పల్‌సోసస్‌’ బయటకు రావడాన్ని హెర్నియేషన్‌ అంటారు. ఇలా బయటకు వచ్చిన హెర్నియేటడ్‌ డిస్క్‌, నరాలపైన ముఖ్యంగా సయాటికా నరంపై ఒత్తిడి కలిగితే, అప్పుడు కనిపించే లక్షణాలను సయాటికా అంటారు.
 
స్పాండైలోలిస్థిసిస్‌: వెన్నుపూసలోని ఎముకలు పరిమితికి మించి ముందుకు గానీ, వెనుకకు గానీ జరగడాన్ని స్పాండైలోలిస్థిసిస్‌ అంటారు. ఇది ఎముకలను పట్టి ఉంచే లిగ్మెంట్లు సాగడం వల్ల ఏర్పడుతుంది. ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల, వెన్నుముకకు దెబ్బతగలడం వంటి జన్యుపరమైన కారణాల వల్ల ఈ నొప్పి వస్తుంది.
 
స్పైనల్‌ స్టీనోసిస్‌: సాధారణంగా వెన్నుపూసలో నాళం ఉంటుంది. దీనిని స్పైనల్‌ కెనాల్‌ అంటారు. ఈ నాళం ఇరుకుగా మారడం లేదా మూసుకుపోవడాన్ని స్పైనల్‌ స్టీనోసిస్‌ అంటారు. నడుము భాగంలోని ఈ నాళం ఇరుకుగా మారితే వెన్నుపూసపై ఒత్తిడి పడుతుంది.
 
పైరిఫార్మిస్‌ సిండ్రోమ్‌: పైరిఫార్మిస్‌ అనే కండరం నడుము భాగంలోని సాక్రమ్‌ ఎముక నుంచి ప్రారంభమై తుంటి వద్ద వరకూ ఉంటుంది. ఈ కండర భాగంలో ఏవైనా గాయాలు సంభవించినప్పుడు లేదా ఎక్కువ సేపు కూచోడం వల్ల కండరం బిగుసుకుపోవడంతో సయాటికా లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణీల్లో చివరి నెలల్లో బిడ్డ పెరిగే కొద్దీ వెన్నుముకపై ఒత్తిడి కలుగుతుంది. అప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
 
లక్షణాలు: మొదట నడుం నొప్పితో ప్రారంభమై పిరుదల నుంచి తొడల వెనుక భాగంలోకి, పిక్కలకు పాకుతుంది. బరువులు ఎత్తినప్పుడు కాళ్లల్లో నొప్పి, సూదులు గుచ్చినట్లుగా ఉండటం, తిమ్మిర్లు, కాళ్లు మడవలేకపోవడం, మరి కొందరిలో మూత్ర విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం లాంటి లక్షణాలను చూడచ్చు.
 
వ్యాధి నిర్థారణ
ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, సీబీపీ ఈ్‌సఐఆర్‌, డిస్ట్‌ ప్రోలాప్స్‌, డిస్ట్‌ హెర్నియేషన్‌
 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స: హోమియోకేర్‌లో అందించబడే జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ హోమియో వైద్యవిధానం ద్వారా ‘సయాటికా’ లక్షణాలను తగ్గించడమే కాకుండా వెన్నుపూస సమస్యల నుండి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. రోగి మానసిక, శారీరక స్థితిని విచారించి వారికి అనువైన వైద్యం అందించి వెన్నుముకను దృఢంగా చేయడం ద్వారా ఈ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ ఇకఈ
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి