ఆస్తమా సమస్యలకు హోమియోకేర్‌

30-10-2018: ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులలో మనం ముఖ్యమైనది ‘‘ఆస్తమా’’. దీని ప్రభావం రోగి శరీరంపైనే కాకుండా వారి మానసిక, సామాజిక పరిస్థితులను సైతం దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఆస్తమా..రోగిపై దాడి చేసే పరిస్థితులు చాలా వరకు అనూహ్యంగా ఉంటాయి. దీనివల్ల రోగి మానసికంగా ఒత్తిడికి గురవుతాడు. అయితే ఈ వ్యాధితో బాధపడేవారు భయభ్రాంతులకు, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు. కచ్చితమైన కాన్సిట్యూషనల్‌ హోమియో వైద్యవిధానం ద్వారా మనం ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచే అవకాశం ఉంది.
 
ఆస్తమా అంటే ఏంటి? దాని కారణాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం..
మనం పీల్చుకున్న గాలి ఓ2 వాయు ద్వారాల (బ్రాంకై, బ్రాంకియోల్స్‌) ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. శరీరంలోని సీఓ2 బయటకు వెళ్లిపోతుంది. ఈ వాయు ద్వారాలు శోధమునకు గురై, వాచిపోవడం వల్ల అవి ఇరుకుగా మారి ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడాన్ని ‘ఆస్తమా’ అంటాము.
 
మన శరీరానికి సరిపడని పదార్థాలు గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు వాయుద్వారాలు వాటికి బలంగా స్పందిస్తాయి. ఇలా స్పందించిన వాయు ద్వారాల కండరాలు బిగించుకుంటాయి. దీని వల్ల వాయుద్వారాలు కాస్త సన్నగా మారతాయి. ఇవి వాపు చెందడం ద్వారా, సాధారణ స్థాయికి మించి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడం వల్ల అవి మరింత ఇరుకుగా మారి, గాలి ప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం వల్ల ఆస్తమా లక్షణాలు ఏర్పడతాయి.
 
ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో వాయు ద్వారాలు ఎప్పుడూ శోధము కలిగే ఉంటాయి. కానీ ఆస్తమాను ప్రేరేపించే పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి.
 
ఆస్తమాని ప్రేరేపించే లక్షణాలు: ఇవి అందరిలో ఒకే రకంగా ఉండవు. పూల మొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు, జంతు కేశాలు, దుమ్మూ ధూళీ, బొద్దింకలు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, ఫ్లూ, జలుబు మొదలైనవి.
 
అధిక శారీరక శ్రమ వల్ల (ఎక్సర్‌సైజ్‌ ఆస్తమా), చల్లని గాలి లేదా చల్లని వాతావరణం, కాలుష్యం, పొగతాగడం, కొన్ని కెమికల్స్‌, వృత్తిరీత్యా దుమ్మును ఎదుర్కోవడం (ఆక్యుపేషనల్‌ ఆస్తమా), ఆస్పిరిన్‌, బీటా బ్లాకర్స్‌ వంటి మందులు, ఆహారాన్ని నిల్వ చేయటకై ఉపయోగించే ప్రిసర్వేటివ్లు, అధిక మానసిక ఒత్తిడి లాంటి అంశాలన్నీ ఆస్తమాను ప్రేరేపిస్తాయి.
 
లక్షణాలు: ఆస్తమా లక్షణాలు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేరుగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చాతీ బిగువుగా లేదా నొప్పిగా అనిపించడం, శ్వాస బయటకు వదిలినప్పుడు పిల్లకూతల వంటి శబ్దాలు వినిపించడం వంటివి కనిపిస్తాయి. ఆస్తమా వల్ల కలిగే దగ్గు రాత్రి వేళలో, వేకువ జామున అధికంగా ఉంటుంది.
 
హోమియో చికిత్స: హోమియో వైద్య విధానంలో రోగిలో ఉన్న వ్యాధిని కాకుండా వ్యాధితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించడం జరుగుతుంది. దీని ద్వారా వారిలోని అసమతుల్యతలకు గురైన రోగనిరోధక వ్యవస్థను సరిచేయడం, అనంతరం బలపరచడం ద్వారా వ్యాధిని నిర్మూలించే అవకాశం ఉంది. ఇందుకు మనం కాన్సిట్యూషనల్‌ హోమియో వైద్య విధానాన్ని అవలంభించాల్సి ఉంటుంది. అటువంటి ఖచ్చితమైన కాన్సిట్యూషనల్‌ హోమియో వైద్య విధానం హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌లో అందించడం జరుగుతుంది.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD

హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి