ఆర్థరైటిస్‌కు హోమియోకేర్‌

23-10-2018: నేటి పరిస్థితుల్లో మన జీవన విధానం ప్రకృతి విరుద్ధంగా సాగుతోంది. దీంతో సరైన వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వంటి కారణాల వల్ల త్వరితగతిన ‘ఆర్థరైటిస్‌’కు గురికావడం జరుగుతోంది.

 
ఆర్థరైటిస్‌ అంటే కీళ్లు శోధనకు గురికావడం. అధిక బరువు, వయసు పైపడటం, ఇన్‌ఫెక్షన్లు, వంశపారంపర్య, ఇన్‌ఫ్లమేటరీ కారణాలు, ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌లు వంటి వాటివల్ల రకరకాల ఆర్థరైటిస్‌ సమస్యలు తలెత్తే అవశాకం ఉంది.
 
ఆర్థరైటిస్‌’లో రకాలు...
ఆస్టియో ఆర్థరైటిస్‌: ఇది ఎక్కువగా 40 సంవత్సరాల వయసు దాటిన వారిలో కార్టిలేజ్‌ అరుగుదల కారణంగా ఎముకల మధ్య రాపిడి పెరగడం వల్ల వస్తుంది. ఈ విధమైన డీజనరేటివ్‌ ఆర్థరైటిస్‌ మగవారితో పోలిస్తే ఆడవారిలో అధికం. ఆర్థరైటిస్‌ శరీరంలో ఏ తరహా కీళ్లలోనైనా ఏర్పడే అవకాశం ఉంది. కానీ శరీర బరువునంతటినీ మోసే మోకాలులో ఇది అధికంగా కనపడుతుంది. మోకాళ్ల వాపు, నొప్పి, చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించడం, కింద కూర్చోలేకపోవడం, ఉదయాన్నే నిద్ర లేచేసరికి కీళ్ల నొప్పులు అధికమవడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
 
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌: ఇది ఒక ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌. జీవన క్రియలో ఏర్పడే అసమతుల్యత వల్ల తలెత్తే ఈ ఆటోఇమ్యూన్‌ డిసీజ్‌ శరీరంలో ఇరువైపులా ఉండే కాళ్లకు సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో కదలికలు పూర్తిగా స్తంభించి కీళ్ల వైకల్యానికి దారి తీస్తుంది.
 
గౌటీ ఆర్థరైటిస్‌: సాధారణంగా మన రక్తంలో ‘యూరిక్‌ ఆమ్లం’ ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మొదట్లో ఇది కాలి బొటనవేలు వంటి ఏదో ఒకటి రెండు కీళ్లకు పరిమితమైనా, క్రమేపీ ఇతర జాయింట్లకు వ్యాపిస్తుంది.
 
సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌: ఇది సీరోనెగెటివ్‌ ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌. దీర్ఘకాలికంగా సోరియాసిస్‌ బాధితులైన వారరిలో 30 శాతం మంది ఈ ఆర్థరైటిస్‌తో బాధపడతారు.
 
ఇన్‌ఫెక్టివ్‌ ఆర్థరైటిస్‌: దీన్నే సెప్టిక్‌ ఆర్థరైటిస్‌ అని కూడా అంటారు. ఇది బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. రక్తం ద్వారా గానీ, కీళ్ల చుట్టూ ఉండే కణజాలం ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు గానీ ఇన్‌ఫెక్టివ్‌ ఆర్థరైటిస్‌ వస్తుంది. ఎక్కువగా ఇది ‘ఆర్టిఫిషియల్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌’ చేయించుకున్నవారిలో కనిపిస్తుంది.
 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స: పైన చెప్పిన అన్ని రకాల ఆర్థరైటిస్‌ సమస్యలకు హోమియో వైద్యంలో మెరుగైన చికిత్సలుంటాయి. మిగతా వైద్య ప్రక్రియలతో పోలిస్తే నొప్పిని తగ్గించడంలోనూ, కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ హోమియోపతిలో చక్కని పరిష్కారం లభిస్తుంది. హోమియోకేర్‌లో మాత్రమే అందించే జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ చికిత్సా విధానం ద్వారా రోగి మానసిక, శారీరక లక్షణాలను సమర్థవంతమైన వైద్య బృందంచే క్షుణ్ణంగా విచారించిన అనంతరం వారికి అనువైన చికిత్సను అందించడం జరుగుతుంది. తద్వారా ఆర్థరైటిస్‌ సమస్యలను సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంది. ఎలాంటి దుష్ఫలితాలూ లేని సురక్షితమైన చికిత్స పొందటం ద్వారా వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD

హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి