ఎస్‌ఎల్‌ఈ వ్యాధికి ‘హోమియోకేర్‌’

13-07-2018: ఎస్‌ఎల్‌ఈ(సిస్టమిక్‌ లూపస్‌ ఎరితిమాటోసిస్‌) ఒక ఆటోఇమ్యూన్‌ వ్యాధి. మన సొంత కణాలపైనే దాడి చేయడం వలన ఏర్పడే వ్యాధులను మనం ‘ఆటోఇమ్యూన్‌ వ్యాధులు’ అంటాము. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కీళ్ళు, చర్మం, రక్త నాళాలు, నాడీ వ్యవస్థ వంటి వాటిని పీడిస్తుంది. 15 నుండి 35 సంవత్సరాల లోపు స్త్రీలలో అధికంగా వచ్చే అవకాశం ఉంది.
 
కారణాలు: శాస్త్రీయపరంగా ఎస్‌ఎల్‌ఈ వ్యాధికి గల కారణాలు అందుబాటులో లేవు. కానీ జన్యుపరమైన, పర్యావరణ కారణాలతో పాటు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాఽధి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
చర్మము: ముఖంపై, బుగ్గలు, ముక్కుపై దద్దుర్లు వస్తుంటాయి. వీటినే ‘బటర్‌ఫ్లై రాష్‌’ అంటాము.
డిస్కాయిడ్‌ లూపస్‌: చర్మం ఎర్రబడటం, పొలుసులు రాలటం, చర్మం పొరల నుండి పగుళ్ళు, నల్లటి మచ్చలు రావటం లాంటివి జరుగుతాయి.
మూత్రపిండాలు: రక్తకణాలు, ప్రొటీన్లు కోల్పోవటం జరుగుతుంది. వాపులు రావడంతో పాటు బరువు పెరుగుతారు. ఈ వ్యాధి దీర్ఘకాలం కొనసాగితే మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి డయాలసిస్‌ గానీ మూత్రపిండాల మార్పిడి గానీ చేయవలసిన అవసరం రావచ్చు.
గుండె: గుండెలోని రక్త నాళాలలో కొవ్వు పదార్థాలు అధికంగా పేరుకుపోతాయి. దీంతో గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా పెరికార్డయిటిస్‌, మయోకార్డయిటిస్‌, ఎండోకార్డయిటిస్‌ లాంటి సమస్యల కారణంగా ఆయాసం, జ్వరం, నీరసం రావచ్చు.
సాధారణంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తుంది.
రక్తహీనత, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గటం జరుగుతుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్‌లకు గురికావటం, గాయమైతే అధిక రక్తస్రావం కావడం జరుగుతాయి.
ఊపిరితిత్తులలో నిమ్ము చేరుతుంది.
మానసిక అశాంతి, పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఫ గర్భస్రావం అధికమయ్యే అవకాశం ఉంటుంది.
వ్యాధి నిర్థారణ పరీక్షలు:  సీబీపీ, సీయూఈ, ఈఎ్‌సఆర్‌, రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ , సీ- రియాక్టివ్‌ ప్రొటీన్‌, (సీఆర్‌పీ)
యాంటీ న్యూక్లియర్‌ యాంటీబాడీస్‌ (ఏఎన్‌ఎన్‌) ఫ యాంటీ ఎస్‌ఎం యాంటీబాడీస్‌, యాంటీ డీఎస్‌ డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్థారించవచ్చు.
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ వైద్యం: ఎస్‌ఎల్‌ఈ వ్యాధికి అనేక చికిత్సలున్నా పూర్తిగా నయం చేసే అవకాశం ఎందులోనో లేదు. కానీ ‘హోమియోకేర్‌’లో అందించే అధునాతన జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ చికిత్సలో రోగి మానసిక, శారీరక తత్వాలను క్షుణ్ణంగా విచారించి ఎస్‌ఎల్‌ఈ వ్యాధికి సరిపడిన మందులను అందించడం జరుగుతుంది.
  
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,
తమిళనాడు, పాండిచ్చేరి