‘ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌’కు హోమియోకేర్‌

18-07-2018: మన శరీరంలో సహజంగా ఉన్న రక్షణ వ్యవస్థ- సూక్ష్మ క్రిములు, జబ్బుల నుంచి కాపాడుతూంటుంది. కానీ ఒక్కోసారి పొరబడి, ఏకంగా మన శరీర భాగాలపై దాడి చేస్తుంది. దీని ఫలితమే రకరకాల ఆటోఇమ్యూన్‌ సమస్యలు. ఈ కోవకు చెందినదే ‘ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌’. సాధారణంగా వెన్ను సమస్యలు- వెన్నుపూసలు అరిగి పోవడం, వాటి మధ్యలో ఉండే డిస్కులు దెబ్బతినడం వలన వస్తాయి. కానీ ఈ సమస్య మాత్రం వెన్ను దగ్గరలోని కణజాలంపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడం వలన సంభవిస్తుంది. ముఖ్యంగా ఇన్‌ఫ్లమేషన్‌ ప్రభావంతో వెన్నెముక బిరుసుగా మారడాన్ని ‘ఆంకిలోసింగ్‌ స్పాండిలె ౖటిస్‌’ అంటాము. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో కనబడుతుంది. ఇది స్త్రీల కంటే పురుషులలో 3 రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే వెన్నెముక దగ్గర కణజాలం ‘ఫైబ్రోసిస్‌’కు గురవుతుందో లేదా వెన్నెముక అసాధారణంగా పెరిగి వెన్నుపూసలు ఒకదానికొకటి కలసిపోవడం జరుగు తుందో- అప్పుడు వెన్నెముక సహజ కదలికలు కోల్పోయి ఒక గట్టి ‘బొంగు కర్ర’లా తయారవుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘బ్యాంబూస్పైన్‌’ అంటాం.
 
కారణాలు: జన్యుపరమైన కారణాలు- ముఖ్యంగా ‘ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌’ వ్యాధితో బాధపడేవారు 90ు హెచ్‌ఎల్‌ఏబి27 అనే జన్యువును కలిగి ఉంటారు.
 
లక్షణాలు: సాధారణం నుంచి అతి తీవ్రమైన స్థాయి నడుమునొప్పితో పాటు, తుంటి కీళ్ళలో, పిరుదులలో నొప్పి ఉండవచ్చు. 
 ‘వెన్నెముక’లోని వెన్నుపూసలు ఒకదానికొకటి కలిసిపోవడం ద్వారా నడుము, తుంటి ప్రాంతము, మెడ భాగాలు బిగువుగా మారి సాధారణ కదలికలకు ఆటంకం కలుగుతుంది. 
 వెన్నెముకను మాత్రమే కాకుండా కాళ్ళు, చేతులలోని కీళ్ళు, గుండె కవాటాలు, ఊపిరితిత్తులు మొదలయిన వాటిపై కూడా ప్రభావం చూపిస్తుంది. 
 40 % ఈ సమస్యతో బాధపడేవారిలో కంటికి సంబంధించిన దుష్ఫలితాలు మొదలవుతాయి. కళ్ళు ఎర్రగా మారడం, వెలుతురు చూడలేకపోవడం, కొన్ని సందర్భాలలో కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
 
దుష్ఫలితాలు: వెన్నుపూసలు ‘ఆస్టియోపోరోసిస్‌’కు గురి కావడం వలన వెన్నెముక ఫ్రాక్చర్లు సంభవిస్తాయి.
వెన్నెముక నుంచి వచ్చే నరాలు ఒత్తిడికి గురవడం వలన కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్లుగా ఉండడం, సత్తువ కోల్పోవడం 
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
నొప్పిని నివారించే మందులు ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.
హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ చికిత్స: ‘ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌’ దీర్ఘకాలిక సమస్య. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించిన వెంటనే వైద్యం చేయడం ద్వారా వెన్నెముక దెబ్బ తినకుండా కాపాడుకునే వీలుంది. కాన్స్‌టిట్యూషనల్‌ హోమియో వైద్య విధానం ద్వారా కేవలం రోగి యొక్క వ్యాధి లక్షణాలుగా చెప్పబడే నొప్పి, తిమ్మిరి, మంటలను తగ్గించడమే కాకుండా, రోగి యొక్క మానసిక, శరీర తత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా, వ్యాధి యొక్క ముఖ్య కారణాన్ని గుర్తించడం జరుగుతుంది. తద్వారా జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ సిమిలిమం వైద్య విధానంలో అందించే చికిత్సతో ‘ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌’ వ్యాధిని నియంత్రింపజేయడం లేదా వ్యాధి తీవ్రతను మందుతో అదుపులో ఉంచడం ద్వారా వ్యాధి యొక్క దుష్ఫలితాలను దరిజేరకుండా చూసే అవకాశం ఉంది.
-డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌
ఇకఈ హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి