ఆంధ్రజ్యోతి, 17-05-13
కీళ్లలో విపరీతమైన నొప్పి. స్పటికాల మాదిరిగా వాపు. ముట్టుకుంటే భరించలేని నొప్పి. గౌటీ ఆర్థరైటిస్ బారినపడిన వారి పరిస్థితి ఇది. నిర్లక్ష్యం చేస్తే కీళ్లు వంకరపోయే అవకాశం ఉంటుంది. సాధారణ చికిత్సలతో ఫలితం లేకపోగా ఆలస్యం చేసిన కొద్దీ మరింత తీవ్రమవుతుంది. అయితే హోమియో చికిత్సతో ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డా. శ్రీకాంత్.
కీళ్లనొప్పులు వంద రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. ఇందులో గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన కీళ్లకు సంబంధించిన వ్యాధి. వీరిలో లక్షణాలు అన్ని ఆకస్మికంగా కనిపిస్తాయి. అంతేకాకుండా తీవ్రంగా ఉంటాయి. రోజువారి పనులు చేసుకోవడం కూడా కష్టమవుతుంది.
కారణాలు
రక్తంలో యూరికాసిడ్ అధికంగా పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే యూరికాసిడ్ చిన్న చిన్న స్పటికాలుగా కీళ్లలో పేరుకుపోతుంది. స్థూలకాయులు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారు, రెడ్‌మీట్, చేపలు ఎక్కువగా తీసుకునేవారు, ఎవరైతే డైయూరిటిక్స్ ఎక్కువగా వాడతారో వారు గౌట్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే తత్వం ఉన్న వారిలో ఎక్కువగా గౌటీ ఆర్థరైటిస్ కనిపిస్తుంది. సాధారణంగా మూత్రపిండాలు యూరియాను బయటకు పంపించి వేయాలి. ఎందుకంటే యూరియా కలుషితమైన ప్రమాదకరమైన వ్యర్థపదార్థము. కానీ 90 శాతం కేసుల్లో గౌట్ కేసుల్లో మూత్రపిండాలు వీటిని బయటకు పంపకపోవడం వల్ల అవి మెల్లగా స్పటికాలుగా మారి చిన్న కీళ్లల్లో చేరిపోయి కీళ్లను డ్యామేజ్ చేస్తాయి. కొన్నిసార్లు మాత్రం యూరియా అనేది ఎక్కువగా ఉత్పత్తి అయినపుడు కూడా ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్సిసార్లు మనము తినే ఆహారపదార్థాలు కూడా కీలకపాత్ర వహిస్తాయి. ఎక్కువగా మద్యంసేవించే వారిలో, మాంసాహారం,చేపలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. కొన్ని శస్త్రచికిత్సల తరువాత, వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మిగతా వ్యాధులతో పాటు ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందులో జీవక్రియలు అదుపు తప్పడం వల్ల అంటే మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల జరిగే అవకాశం ఉంది. వీటిలో పొట్ట బాగా పెరగడం, కిడ్నీ ఫెయిల్యూర్, హైబీపీ, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, రక్తహీనత, సొరియాసిస్ వల్ల వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు కొన్ని మందులు ఎక్కువగా వాడటం వల్ల, ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వాడటం వల్ల గౌట్ తలెత్తే అవకాశం ఉంది. డైయూరిటిక్స్ వాడటం వల్ల గౌట్ ఎక్కువయ్యే అవకాశం ఉంది.
లక్షణాలు
ఆకస్మికంగా నొప్పి, కీ ళ్లలో వాపు, ముట్టుకుంటే భరించలేని నొప్పి, కీళ్లు ఎరుపెక్కడం వంటి లక్షణాలు ఉంటాయి. పాదం, కాలి బొటన వేలు, మడమలు, మోకాళ్ల దగ్గర ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా కాలి, చేతి వేళ్లు ఎక్కువగా ప్రభావానికి గురవుతాయి. ఎర్రగా వాచిపోయి, ముట్టుకుంటే విపరీతమైన నొప్పి, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేళ్లలో బొటన వేలుపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తరువాత మడమలు, మోకాళ్లు, మోచేయి, మణికట్టు, చేతివేళ్లు...ఇలా ఒక్కో భాగానికి వ్యాపించడం మొదలవుతుంది. నొప్పి ముఖ్యంగా రాత్రివేళ ఎక్కువ అవుతుంది. దాదాపుగా రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది. వీటితో పాటు అలసట, కొంత జర్వం ఉంటుంది. ఈ వ్యాధి మరీ ముదిరినట్లయితే చిన్న స్పటికాలుగా కీళ్లవద్ద కనిపిస్తూ ఉంటుంది. ఇవీ మరీ ఎక్కువ అయినట్లయితే కీళ్ల వద్ద రాపిడికి గురై ఎముకలు కరిగి మళ్లీ ఆర్థరైటిస్ దారి తీసే అవకాశం ఉంది.
పరీక్షలు
యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు పరీక్షలు చేయించాలి. ఎక్స్‌రేలో కీళ్లలో ఏర్పడిన స్పటికాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఆహారనియమాలు
సమతుల ఆహారం తీసుకోవడం, చేపలు, ఆల్కహాల్, మాంసాహారంకు దూరంగా ఉండటం చేయాలి. రోజూ వాకింగ్ చేయడం, బరువును తగ్గించుకోవడం చాలా అవసరం.
హోమియో చికిత్స
రోగి శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలను పరిశీలించి, వ్యాధి నిర్ధారణ చేసుకుని హోమియో చికిత్స అందిస్తే చాలా వరకు సమస్య తగ్గిపోతుంది. మూలకారణాన్ని కనుక్కుని దాన్ని తొలగించే విధంగా చికిత్స ఇవ్వడం ద్వారా సులభంగా పరిష్కారం లభిస్తుంది. దీంతో వ్యాధి తగ్గడంతో పాటు తత్వాన్ని కూడా నిర్మూలించడం ద్వారా శాశ్వత విముక్తి లభిస్తుంది. కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నాయని అదేపనిగా పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గౌట్ లక్షణాలు కనిపించినపుడు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.
డా. శ్రీకాంత్ మొర్లవార్
సీఎండీ
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్ర్తె.లి.
ఫోన్ : 9550003399