రణగొణ ధ్వనులతో హృద్రోగ ముప్పు

27-6-2017: నగరంలో నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై వెలువడే శబ్ద కాలుష్యం హృద్రోగాలకు దారితీస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. వాహనాల రణగొణ ధ్వనులు గుండె పనితీరును, గుండె కొట్టుకునే వేగాన్ని ప్రభావితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తక్కువస్థాయిలో ఉన్న శబ్దాలు కూడా తీవ్రమైన హృద్రోగాలకు కారణమవుతున్నాయని ట్రెంట్‌ వర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.