నడివయసులో ‘హాఫ్‌’ కొడితే గుండెకు ముప్పే!

మందుబాబులూ జాగ్రత్త! నడివయసులో ఎక్కువగా మందుకొడితే గుండెకు ముప్పట! రోజుకు రెండు డ్రింకులు లేదా ‘హాఫ్‌’ తాగేస్తే గుండెనొప్పి ఖాయమని చెక్‌ రిపబ్లిక్‌లోని సెయింట్‌ ఆన్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పోగా, అధిక రక్తపోటు, మధుమేహం ఎలాగూ తోడు వస్తాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాదాపు 11,644 మంది మధ్యవయస్కులైన స్వీడన్‌ కవలలపై దీర్ఘకాలిక పరిశోధనను చేశారు. దాదాపు 43 ఏళ్ల పాటు వారి డ్రింకింగ్‌పై పరిశీలనలు చేశారు. మామూలుగా తాగే వారితో పోలిస్తే ఎక్కువగా తాగే తూగే వారిలో జన్యుపర, వారసత్వ కారణాలతో సంబంధం లేకుండా 34 శాతం ప్రమాదమెక్కువ అని తేల్చి పారేశారు.