మైగ్రేన్‌తో గుండెకు ముప్పు

13-7-2017: మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడే మహిళల్లో  గుండెనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న సంగతి ఇటీవలి  పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికా, జర్మనీలలో మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడే సుమారు లక్షన్నర మంది మహిళల మీద వీరు సుదీర్ఘ అధ్యయనం చేశారు. వీరిలో సుమారు పదిహేడు వేల మంది మహిళలు మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడతున్నారు. వీరిలో సుమారు పదిహేను వందల మంది గుండె వ్యాధుల బారిన పడినట్టు వీరు గుర్తించారు. మరికొంత కాలం తరువాత వీరిలో మూడు వందల మంది గుండెనొప్పితో మరణించారు. అయితే వీరి మరణాలకి మైగ్రేన్ తలనొప్పే కారణమన్న సంగతిని మాత్రం అధ్యయనంలో నిర్ధారించలేకపోయారు. అయితే మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడేవారికి గుండెనొప్పి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని వీరు చెబుతున్నారు. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు అంటున్నారు.