గుండెపోటును పసిగట్టండి

28/01/14

 కారణమంటున్నారు వైద్యులు. యుక్తవయస్కుల్లో హార్ట్‌ఎటాక్‌రావడానికి స్మోకింగ్‌ ముఖ్యకారణం. గతంలో స్ర్తీలలో మెనోపాజ్‌ దాటిన తరువాత గుండె పోటు వచ్చేది. ఇప్పుడు 30, 40 ఏళ్ల వారిలోనూ వస్తోంది. హైపర్‌టెన్షన్‌ , డయాబెటిస్‌ వల్ల కూడా హార్ట్‌ ఎటాక్స్‌ సంఖ్య పెరుగుతోందంటున్నారు వైద్యులు.

గుండెపోటును కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చని అంటున్నారు వైద్యనిపుణులు. ఛాతీ కింది భాగంలో బరువుగా ఉండటం, అదిమిపెట్టినట్లుగా అనిపించడం, మెట్లు ఎక్కినపుడు, బరువు మోస్తున్నప్పుడు నొప్పి వస్తుండటం, ఎడమ చేతి వైపు నొప్పి విస్తరిస్తుండటం వంటి లక్షణాలుంటే గుండెపోటు అని నిర్ధారించుకోవాలని వారు సూచిస్తున్నారు. కొందరిలో మాత్రం ఇటువంటి లక్షణాలు కనిపించవంటున్నారు.డయాబెటిస్‌ రోగుల్లో, వయసు పైబడిన వారిలో, స్త్రీలలో ఈ తరహా లక్షణాలు కనిపించవు. మరికొందరిలో వీపు మధ్య భాగంలో, దవడ భాగంలో నొప్పి,  కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె పోటు వచ్చిన వ్యక్తి చెమటతో పూర్తిగా తడిసిపోయి ఉంటాడు. ఈ వ్యక్తిని నడిపించడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. వెంటనే ఆంబ్యులెన్స్‌ కోసం ఫోన్‌ చేయాలి. డిస్ర్పిన్‌ మాత్రను నీళ్లలో కరిగించి తాగించాలి. దగ్గరలోని అసుపత్రికి తరలించాలని సూచిస్తున్నారు వైద్యులు.

గుండె పోటు వచ్చిన వ్యక్తిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. గుండెపోటు వచ్చిన తరువాత మొదటి గంట సమయాన్ని గోల్డెన్‌ అవర్‌ అంటారు. అంటే ఈ సమయంలో ఆసుపత్రికి తీసుకువస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువ. ఈ సమయంలో (సాఫ్ట్‌ బ్లాక్‌) బ్లాక్‌ చిట్లిపోయి రక్తం గడ్డకట్టిపోయి ఉంటే మందులను నరం ద్వారా ఎక్కించి రక్తం గడ్డను కరిగించవచ్చు. 12 నుంచి 24 గంటలు గడిచినట్లయితే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయాలి. ముందుగా యాంజియోగ్రామ్‌ చేసి ఎక్కడ బ్లాక్‌ ఉందో గుర్తించి రక్తపుగడ్డను తీయాలి. ఇప్పుడు యాంజియోప్లాస్టిలో ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రక్తనాళం గుండా ట్యూబ్‌ను పంపించి క్లాట్‌ను వెంటనే బయటకు లాగేయవచ్చు. దీనివల్ల మళ్లీ గుండెపోటు రాకుండా కాపాడవచ్చు. 

గట్టిగా ఉన్న బ్లాక్‌ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. ఇది చిట్లదు. క్రమంగా రక్తనాళం పూడుకుంటూ వస్తుంది. ఈ దశలో మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడం జరుగుతుంటుంది. రక్తనాళం మొత్తం పూడుకుపోయినపుడు గుండెపోటు వస్తుంది. ఇటువంటి సమయంలో యాంజియోగ్రామ్‌ చేయాల్సి ఉంటుంది.  రెండు, మూడు బ్లాక్స్‌ ఉంటే యాంజియెప్లాస్టి చేసి స్టెంట్స్‌ వేయాల్సి ఉంటుంది. అయితే మూడు కన్నా బ్లాక్స్‌ ఎక్కువ ఉంటే బైపాస్‌ సర్జరీ చేయించుకోవడమే ఉత్తమమంటున్నారు వైద్యులు. 

గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి వైద్యులు సూచించిన కొన్ని పరీక్షలను  చేయించుకోవాలి. 30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ కొలెస్ర్టాల్‌ ఎంత ఉందో తెలుసుకోవాలి. బి.పి, డయాబెటిస్‌ పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటిస్‌ ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవాలి. బిపి ఉంటే మందులు వాడాలి.  కుటుంబసభ్యుల్లో ఎవరైనా గుండెపోటుతో చనిపోయి ఉంటే వారి వారసులకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలంటున్నారు వైద్యులు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం, స్మోకింగ్‌, ఆల్కహాల్‌ పూర్తిగా మానేయడం, జీవన విధానం మార్చుకోవడం, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులు దరిచే రకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు.