విటమిన్‌ డి ఎక్కువైతే ముప్పు

విటమిన్ల కొరత మూలంగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని తెలుసు కానీ ఎక్కువైనా ముప్పేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. శరీరంలో విటమిన్‌ డి స్థాయులు మితిమీరితే గుండె జబ్బుతో మరణించే ప్రమాదం పెరిగినట్లేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు కోపెన్‌హాగన్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రక్తంలో విటమిన్‌ డి స్థాయులు మరీ తక్కువైనా.. మరీ ఎక్కువైనా ముప్పేనని తేలింది. 

ఒక లీటరు రక్తంలో 50 నానోమోల్‌ కన్నా తక్కువ ఉన్నా, 100 నానోమోల్‌ కన్నా ఎక్కువైనా భవిష్యత్తులో గుండె జబ్బుతో మరణించే ప్రమాదం ఎక్కువేనని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన పీటర్‌ ష్క్వార్జ్‌ తెలిపారు.