వయసులో రజస్వల కాకపోతే గుండెకు ముప్పే

మహిళలు యుక్త వయసులో రజస్వల అవడం సాధారణం.. అలాకాకుండా మరీ చిన్న వయసులోనో లేక మరీ ఆలస్యంగానో రజస్వల అయిన వారు భవిష్యత్తులో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా.. 50 నుంచి 64 ఏళ్ల వయస్సున్న 13 లక్షల మహిళలపై అధ్యయనం చేసినట్లు ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు వివరించారు. 

పదేళ్లలోపు.. పదిహేడేళ్ల తర్వాత రజస్వల అయిన మహిళల్లో గుండె జబ్బులతో పాటు హైబీపీ తదితర ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వారు వివరించారు. వీరితో పోలిస్తే 13 ఏళ్ల వయసులో రజస్వల అయున మహిళలకు ఈ ప్రమాదం తక్కువని అన్నారు.