ఎక్స్‌రేలతో గుండెకు హాని

హృద్రోగాలకు దారితీస్తున్న రేడియేషన్‌

బెర్లిన్‌/లండన్‌, జూలై 14: ఎక్స్‌రే, స్కానింగ్‌ తదితర వైద్య పరీక్షల సందర్భంగా పడే స్వల్ప స్థాయి రేడియేషన్‌ కూడా హృద్రోగాల ముప్పును పెంచుతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. రేడియేషన్‌ ప్రభావం ఏళ్ల తరబడి ఉంటోందని పేర్కొంది. రేడియేషన్‌ జోన్‌లో ఎంతసేపు, ఎలా ఉన్నారనే విషయం అప్రస్తుతమని, కొద్దిమొత్తంలో రేడియేషన్‌కు గురైనా గుండె పనితీరును ప్రభావితం చేస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఎక్కువ పనిగంటలతో గుండె లయ తప్పుతుందని మరో అధ్యయనం తేల్చింది. వారానికి 35 నుంచి 40 గంటల పాటు పనిచేసే వారితో పోలిస్తే వారానికి 55 గంటల పాటు పనిచేసే వారికి హృద్రోగ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు వివరించారు.