బట్టతల, తెల్లజుట్టుతో హృద్రోగం

01-12-2017: నలభై ఏళ్లు దాటకముందే బట్టతల, తెల్లజుట్టు వచ్చేస్తోందా! అయితే, జాగ్రత్త. ఎందుకంటే ఈ సమస్యలు ఉన్న వారిలో హృద్రోగాలు వచ్చే ముప్పు 5 రెట్లు ఎక్కువని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. కోల్‌కతాలో జరుగుతున్న ‘హృద్రోగ భారతీయ సమాజం 69వ వార్షిక సమావేశం’లో ఈ అధ్యయనం చర్చకు వచ్చింది. దీనిలో భాగంగా 2వేల మంది 40ఏళ్లలోపు వారిని పరీక్షించగా బట్టతల, తెల్లజుట్టు ఉన్న వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చినట్లు గుర్తించామని యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ శాస్త్రవేత్తలు తెలిపారు.