న్యూయార్క్, జూన్ 27: అదేపనిగా మద్యం తాగే యువతలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. తర్వాతి కాలంలో దీని ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దాదాపు 5వేలమందిపై యువతీయువకులపై పరిశోధన చేయగా మగవాళ్లలో అధిక రక్తపోటు, బ్లడ్ కొలస్ట్రాల్ ప్రమాదకరంగా ఉంటే.. మహిళల రక్తంలో అధిక చక్కెరస్థాయి ఉన్నట్లు తెలిసింది. ఈ సర్వే వివరాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనే జర్నల్లో ప్రచురించారు.