బరువున్న ఈతగాళ్లకు గుండెపోటు ముప్పు

మెల్‌బోర్న్‌, జూలై 29: వయసు మళ్లిన, ఎక్కువ బరువుండే ఈతగాళ్లలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఊబకాయంతో బాధపడే వాళ్లలో రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ ఉండటం వల్ల నీళ్లలో ఈత కొట్టేప్పుడు రక్త సరఫరా సరిగా జరగక గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.