నడుంలో కొవ్వు... గుండెకు చిల్లే..

15-10-2018: నడుం భాగంలో కొవ్వు హృదయ సంబంధిత వ్యాధులను కోరుకున్నట్లేనని సఫోలా లైఫ్‌ కంపెనీ జరిపిన సర్వేలో తేలింది. ఈమేరకు బెంగళూరులో సఫోలా లైఫ్‌ నివేదికను ఆది వారం విడుదల చేశారు. దేశంలో 67శాతం మంది నడుం భాగంలో కొవ్వు ద్వారానే గుండె జబ్బులకు లోనవుతున్నారని వీరిలో 83శాతం మంది ఇబ్బంది పడినవారేనని నివేదికలో పేర్కొన్నారు.

10 శాతం మందికి అధికభారం, 35 ఏళ్ళలోపు వారిలో 63శాతం మంది కొవ్వు సమస్యతో ఉన్నవారేనని ప్రముఖ న్యూట్రిషన్‌ పూజా మహిజా తెలిపారు. లీలావతి ఆసుపత్రి ఎండోక్రైనాలజిస్ట్‌ పద్మశ్రీ డా.శశాంక్‌జోషిలు వివరాలు తెలిపారు. రోజుకు 8 గంటలకుపైగా కూర్చుని పనిచేసేవారికి కొవ్వు పెరిగే శాతం అధికమన్నారు. జీవనశైలి మార్చుకుంటేనే హృదయ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చునన్నారు.