అజీర్తి మందులతో పొంచి ఉన్న మరణం!

వాషింగ్టన్‌, జూలై 4: గుండెలో మంట, అజీర్తి సమస్యలకు ఎక్కువ కాలం మందులు వాడితే చనిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కడుపులో అల్సర్‌ లాంటి సమస్యలు వచ్చినపుడు వెంటనే ప్రోటాన్‌ పంప్‌ నిరోధకం(పీపీఐ) మందులు వేసుకుంటూ ఉంటాం. ఆ మందులతో మరణం సంభవించే అవకాశాలు 50 శాతం ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని వాషింగ్టన్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.