గుండె జబ్బుకు చేరువవుతున్నారా? జాగ్రత్త

హైదరాబాద్, 28-09-2018: శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులకు చేరవవుతున్నారని తేలింది. హైదరాబాద్‌లో పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న 45 ఏళ్ల వయస్సు వారిలో 52 శాతం మందికి గుండె జబ్బును ఎదుర్కొనే అవకాశముంది. 
హైదరాబాద్‌లో నివసించే 63 శాతం మంది పురుషులు, 52 శాతం మహిళలు గుండె జబ్బుకు చాలా దగ్గరలో ఉన్నట్లు తేలింది.
పొట్టపై కొవ్వు ఉన్న 63 శాతం మంది సక్రమంగా వ్యాయామం చేయడం లేదని ఈ సర్వే గుర్తించింది.
ప్రతి పది మందిలో ఏడుగురు నగర వాసులు వారంలో ఒక రోజు బయట ఆహారం తీసుకోడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ ముప్పునకు గురవుతున్నారు.
 గుండె జబ్బు ముప్పు ఉన్న వారిలో పది మందిలో ఎనిమిది మంది పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు ప్రధాన కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు.
8 మన దేశంలో 68శాతం మంది పరుషులు, 66 శాతం మంది మహిళలు పొట్టు, నడుము చుట్టూ ఉన్న కొవ్వుతో గుండె జబ్బుకు చేరువుగా ఉన్నట్లు గుర్తించారు.
 35 ఏళ్ల లోపు వయస్సు బాధితుల్లో అయిదు మందిలో ముగ్గురు పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్లనే గుండె జబ్బు సమస్యను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.
68శాతం ఉద్యోగులు, 65 శాతం గృహిణులకు బెల్లీఫ్యాట్‌తో గుండెజబ్బు ముప్పు ఉన్నట్లు గుర్తించారు.
 
51 శాతం భోజనం మానేస్తున్నారు..
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుండడంతో చాలా మంది భోజనం మానేస్తున్నారని పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ లతశ్రీ తెలిపారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన స్థితిలో ఉన్న వారు 51 శాతం మంది భోజనం మానేస్తున్నారని, 70శాతం మంది బయటి భోజనాన్ని వారంలో ఒక్కసారైనా తీసుకోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోందని, ఇంటి భోజనం చేస్తున్న వారిలో 69 శాతం, సక్రమంగా వ్యాయామం చేయనివారిలో 63శాతం, ఎక్కువ పని చేసే వారిలో 69 శాతం మంది గుండె సమస్యలకు చేరువవుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఎక్కువ పనిచేసే వారిలో 64 శాతం మంది, సాధారణంగా పనిచేసే వారిలో 61 శాతం మంది గుండె జబ్బు ముప్పు బారిన పడుతున్నారని తెలిపారు.
 
ఇవీ కారణాలు...
ఆహారపు అలవాట్లు, దైనందిన కార్యక్రమాల్లో వేగంగా చోటుచేసుకున్న మార్పుల వల్లనే యువతలో గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్నట్లు వైద్యులు వివరించారు. హృద్రోగ సమస్యతో బాధపడే యువత సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ గంటలపాటు పనిచేయడం, ఉద్యోగ ఒత్తిడి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, సుఖవంతమైన నిద్రపోకపోవడం, అనిశ్చితమైన జీవనశైలి వంటివి కారణాలు ఈ అధ్యయనం ద్వారా తేలిందని డాక్టర్‌ శరత చంద్ర వివరించారు. ఈ కారణాలు గుండెజబ్బు, అధిక బరువు, మధుమేహానికి దారి తీస్తున్నాయని చెప్పారు. వ్యక్తులు బక్కపల్చగా ఉన్నప్పటికీ పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతే హృద్రోగ సమస్యకు కారణమవుతుందని వివరించారు.
 
బాడీ మాస్‌ ఇండెక్స్‌ కంటే..
18 నుంచి 23 కిలోలు - 63 శాతం
23 నుంచి 25 కిలోలు - 65 శాతం
25 కిలోల కంటే ఎక్కువ.. - 69 శాతం