వాల్‌నట్స్‌తో గుండెకు బలం...

ఆంధ్రజ్యోతి, 13/05/2015: మీరు రోజూ తినే డైట్‌లో వాల్‌నట్స్‌ ఉంటున్నాయా? ఒకవేళ లేకపోతే వాటిని తప్పనిసరిగా మీ ఫుడ్‌లో చేర్చండి. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు.... సాక్షాత్తు పోషకాహార నిపుణులు.... హృద్రోగ వైద్యులు !  వాల్‌నట్స్‌ వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా వాల్‌నట్స్‌లో శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు కేన్సర్‌లాంటి వ్యాధులు రాకుండా నియంత్రిస్తాయి. ఊబకాయం రాదు. మెదడుకు కూడా ఇవి ఎంతో మంచిది. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
 
శరీరంలోని వాతదోషాన్ని సైతం నివారిస్తాయి.. అంతేకాదు ఇవి శరీరంలోని మొత్తం కొలెసా్ట్రల్‌ని తగ్గిస్తాయని అంతర్జాతీయ హృద్రోగ వైద్యనిపుణులు అంటున్నారు. చెడు కొలస్ట్రాల్‌ను కూడా ఇవి తగ్గిస్తాయని వాళ్లు చెబుతున్నారు. రోజుకు 28 గ్రాముల వాల్‌నట్స్‌ తినడం వల్ల గుండెపోటు పాలబడమట. అంతేకాదు రోజూ వీటిని పరిమితంగా తినడం వల్ల అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దూరమవుతామట. ఈ నట్స్‌ ఆరోగ్యానికి ఎంతో ఎక్కువ మేలు చేస్తాయి. అంతేకాదు వీటిల్లో బహుళ ప్రయోజనాలు కూడా దాగున్నాయి. పచ్చి వాల్‌నట్స్‌ను తినొచ్చు. కాస్త రుచిగా తినాలనుకునేవారు వాటిని రోస్ట్‌ చేసి తినొచ్చు. క్రంచీ ఫ్లేవర్‌ కోసం సలాడ్స్‌ వంటి వాటిల్లో వీటిని ఉపయోగించవచ్చు. అంతేకాదు కేక్స్‌, బిస్కట్స్‌ వంటి వాటిల్లో కూడా వీటిని వాడతారు. స్పైసీగా ఉండే పదార్థాల్లో కూడా వీటిని వాడితే రుచిగా ఉంటుంది. డిన్నర్‌కు ముందు డ్రింక్స్‌ తాగేటప్పుడు వీటిని తింటే బాగుంటుంది. వాల్‌నట్స్‌ ఆయిల్‌ కూడా ఉంది. ఇందులో ఆరోగ్యవంతమైన ఫ్యాటీ యాసిడ్స్‌ ఎన్నో ఉన్నాయని పలువురు చెఫ్స్‌ చెపుతున్నారు. ఈ ఆయిల్‌ చాలా ఖరీదైంది. దీన్ని ఎక్కువగా సలాడ్‌ డ్రెస్సింగ్‌ వంటి వాటిల్లో ఉపయోగిస్తుంటారు. వాల్‌నట్‌ డిష్‌సలో ఓట్‌మీల్‌ చాకొలేట్‌ చిప్‌, వాల్‌నట్‌ కుక్కీస్‌, మష్‌రూమ్‌ అండ్‌ వాల్‌నట్‌ సూప్‌ వంటివి కొన్ని. ఇవి కాకుండా వాల్‌నట్‌ కాఫీ కేక్స్‌, వాల్‌నట్‌ సలాడ్‌లు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. శరీరానికి బలాన్నిస్తాయి.