ఈ డైట్‌తో గుండెకు మేలు

ఆంధ్రజ్యోతి,29-8-2016:బైపాస్‌ సర్జరీ జరిగిందా? ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదా? అయితే జాగ్రత్త! పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు వైద్యులు. బైపాస్‌ సర్జరీ అయిన వ్యక్తులు వీలైనంత వరకు మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. చాలామంది ఫ్యాటీ ఫుడ్‌ తీసుకుంటే కొలెసా్ట్రల్‌ పెరుగుతుందని అనుకుంటుంటారు. కానీ కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా శరీరం దాన్ని సమం చేస్తుంది. కాబట్టి ఆహారంలో పూర్తిగా ఫ్యాట్‌ లేకుండా చూసుకోవడం కంటే సమపాళ్లలో ఉండే చూసుకోవాలంటున్నారు. ధాన్యాలు, గోధుమలు, జొన్నలు, పప్పులు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. నూనె, ఉప్పు వాడకం బాగా తగ్గించడం ద్వారా గుండెకు మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. రోజూ తీసుకునే మొత్తం ఆహారంలో నూనె అర టీ స్పూన్‌ మించకుండా చూసుకోవాలి. వారంలో రెండు రోజులు మీ డైట్‌లో చేపలు ఉండేలా చూసుకుంటే గుండెకు తగినంత రక్షణ లభిస్తుందని వైద్యులు అంటున్నారు.