అధిక రక్తపోటు గుండె కవాటాలకు చేటు

19-10-2017: అధిక రక్తపోటు వల్ల గుండె కవాటాల్లో లోపాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధనలో వెల్లడైంది. చిన్నవయసులో అధికరక్తపోటు లక్షణాలు కనిపిస్తే గుండె నుంచి శరీరభాగాలకు రక్తసరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయని.. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. ముఖ్యంగా గుండెలోని మిట్రల్‌ కవాటాలకు సమస్యలు తలెత్తుతాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ కాజిమ్‌ రహిమి వెల్లడించారు. దీనివల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, త్వరగా అలసిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.