ధ్యానంతో గుండె పదిలం

13-10-2017: ధ్యానం చేయడం వలన కలిగే పలు ఆరోగ్య లాభాల గురించి తెలిసిందే! ఇప్పుడు అదే ధ్యానం గుండెను పదిలంగా ఉంచుతుంది అంటున్నారు అమెరికా పరిశోధకులు. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. ధ్యానం కారణంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయనీ, ఇవే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయని వారు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వలన గాఢనిద్ర కూడా పడుతుందని వీరు అంటున్నారు. అయితే ధ్యానం చేయడం వలన రక్తపోటును అదుపు చేసుకోవచ్చు అన్న విషయాన్నిప మాత్రం వీరు స్పష్టం చేయలేకపోతున్నారు.