అర్ధరాత్రి చిరుతిళ్లతో హృద్రోగాలు, మధుమేహం

మెక్సికో వర్సిటీ పరిశోధకుల హెచ్చరిక

09-11-2017: అర్ధరాత్రి సమయంలో బంగాళాదుంపల చిప్సు, చెగోడీలు, జంతికలు లాంటి చిరుతిళ్లు తినే అలవాటుందా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. అలా తినేవారికి హృద్రోగాలు, మధుమేహం వచ్చే ముప్పు చాలా ఎక్కువని మెక్సికో వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా వారు కొన్ని ఎలుకలకు.. అవి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం పెట్టారు. వెంటనే వాటి రక్తంలో కొవ్వు స్థాయులు భారీగా పెరిగిపోయాయి. చురుగ్గా ఉండే పగటి సమయంలో అదే ఆహారం పెట్టినా రక్తంలో కొవ్వు స్థాయులు అంతగా పెరగలేదని తేలింది. దీని తర్వాత ఎలుకల జీవగడియారాన్ని నియంత్రించే భాగాన్ని వాటి మెదడు నుంచి తొలగించారు. ఆ తర్వాత ఏ సమయంలో ఆహారం పెట్టినా వాటి రక్తంలోని కొవ్వు స్థాయుల్లో మార్పు రాలేదని గమనించారు.