సగం మరణాలను అడ్డుకోవచ్చు

ఆంధ్రజ్యోతి, 20-10-2015: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికుల ప్రాణాల్ని కబళిస్తున్న ప్రధాన వ్యాఽధుల్లో గుండె జబ్బులు ప్రథమ స్థానంలో ఉన్నాయి. అయిన వాళ్లూ, ఆత్మీయులు ఈ జబ్బు బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రతిసారీ అసలీ గుండె జబ్బుల్ని అరికట్టలేమా? అంటూ హృదయాలు ఘోషిస్తాయి. అందుకు సమాధానంగా...., లేకేం కనీసం సగం మరణాల్నైతే కచ్చితంగా అడ్డుకోవచ్చునంటున్నాయి ఇటీవలి అధ్యయనాలు. ఎమోరీ యూనివర్సిటీలో డాక్టర్‌ శివానీ పాటిల్‌ సమర్పించిన ‘యానల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ ’’ అనే ప్రచురిత పరిశోధనా పత్రంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. దాదాపు సగానికి పైగా హృద్రోగ మరణాలు కొద్దిపాటి జాగ్రత్తలతో అరికట్టగలిగేవే అన్నది ఆ పత్రంలోని సారాంశం. గుండె పోటు మరణాలకు ప్రధానంగా, పొగ తాగడం, కొలెసా్ట్రల్‌ నిలువలు పెరిగిపోవడం, అధిక రక్తపోటు, టైప్‌-2 మధుమేహం ఇవే కారణంగా ఉంటున్నాయని ఆ పత్రంలో స్పష్టం చేశారు. ఇతరమైన గుండెపోట్లకు కారణమయ్యే కుటుంబ చరిత్ర, ప్రాంతీయత, వృద్ధాప్యం, జన్యుమూలాల వంటి ప్రమాదాలనైతే అరికట్టలేకపోవచ్చు గానీ, పైన తెలిపిన జీవన శైలి ప్రమాదాలనైతే ఎవరికి వారు నియంత్రించుకోవచ్చు.
 
ఏడాది కాలంలో జరిపిన ఒకానొక అధ్యయనంలో 45 నుంచి 79 ఏళ్ల మధ్య వయసులో ఉన్న ఓ 5 లక్షల మందిని పరిశీలించారు. అందులో ప్రతి ఐదుగురిలో నలుగురు జీవన శైలి కారణాల్లో ఏదో ఒకదానికి దెబ్బ తిన్న వారేనని ఆ అధ్యయనంలో వెల్లడయ్యింది. హానికారకమైన ఈ జీవన శైలి అలవాట్లకు దూరమై ఉంటే, ఇప్పటిదాకా సంభవించిన పురుషుల మరణాల్లో 54 శాతం, సీ్త్రల మరణాల్లో 50 శాతం కచ్చితంగా అరికట్టబడేవే అంటున్నారు పరిశోదకులు. ప్రత్యేకించి, అధిక రక్తపోటు, ధూమపానం, టైప్‌-2 మధుమేహంతో కలిగిన మరణాలు పూర్తిగా నిరోధించబడేవే. క్రమం తప్పని రోజువారీ వ్యాయామం, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు, పొగ తాగకపోవడం, నిర్ధిష్టమైన శరీరం బరువు ఇవి పాటి స్తూ, అధిక రక్తపోటు, కొలెసా్ట్రల్‌, రక్తంలో షుగర్‌ నిలువల్ని సమస్థితిలో నిలబెట్టుకుంటే, ఎవ రైనా తమ గుండెను పూర్తి ఆరోగ్యంగా, నిండు నూరేళ్లూ కాపాడుకోవచ్చు. ఏమైనా, వ్యాధుల పాలయ్యాక చికిత్స చేయడానికి వెచ్చించే సమయం కన్నా, హృద్రోగాలకు దారి తీసే ఆ జీవన శైలినే సమూలంగా మార్చివేయడం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఈ ఒక్క నియంత్రణ వల్లనే సగం హృద్రోగ మరణాలకు మనం స్వస్తి పలకవచ్చు.