అప్రమత్తతే పరిష్కారం

11-12-2017:ఈ సమస్యలు ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో కనిపించకపోయినా అప్పటికే హృద్రోగ చికిత్స తీసుకుంటున్నవాళ్లు, అంతర్లీనంగా గుండె సమస్య ఉండి, ఆ విషయం కనిపెట్టలేనివాళ్లకు చలికాలంలో ఈ సమస్యలు హఠాత్తుగా బయల్పడి ఇబ్బంది పెడతాయి. హృద్రోగానికి చికిత్స తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నా, చలికాలంలో తలెత్తే ఉష్ణోగ్రతల్లో మార్పుల ప్రభావం శరీరాన్ని ఒడిదొడుకులకు లోనుచేసి గుండె మీద ఒత్తిడి పడేలా చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే....

వెచ్చని దుస్తులు ధరించాలి.
ఎండలోనే బయటకు వెళ్లాలి.
ఒళ్లు అలసిపోయేలా విపరీతమైన వ్యాయామం చేయకూడదు.
మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
వెచ్చని వాతావరణంలో నుంచి చల్లని ప్రదేశంలోకి లేదా చల్లని ప్రదేశం నుంచి వేడి వాతావరణంలోకి హఠాత్తుగా వెళ్లకూడదు.
మందులు సమయానుసారం తీసుకోవాలి.
క్రమంతప్పక వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
రాత్రివేళ తొందరగా తిని తొందరగా నిద్ర పోవాలి.
మధుమేహం, రక్తపోటు అదుపు తప్పకుండా చూసుకోవాలి.
వేడిగా ఉండే ఆహారమే తినాలి.
ఏ పనైనా నెమ్మదిగా చేయాలి.