తియ్యటి పానీయాలతో గుండెకు చేటు!

ఆంధ్రజ్యతి, 9-11-15

సాధారణంగా మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే గుండెకు మంచిది కాదు. దీంతో పాటు తియ్యని పానీయాలు ప్రతి రోజు తీసుకుంటే గుండెకు చేటు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రతి రోజు రెండు గ్లాసుల చొప్పున స్వీట్‌ డ్రింక్స్‌ను తీసుకుంటే బ్లడ్‌ ప్రెషర్‌, డయాబెటిస్‌, గుండె నొప్పి సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనంలో తేలింది. తియ్యని పానీయాలు ప్రతి రోజూ ఖచ్చితంగా తీసుకునే 42,400 మంది ఆరోగ్య డేటాను పరిశీలించారు. వారిలో ఎక్కువ మంది గుండె కు సంబంధించిన సమస్యలతో   బాధపడుతున్నట్టు  తెలిసింది.
టీ, కాఫీలతో పాటు చక్కెర అధికంగా కలిపిన పళ్లరసాలు, ఫ్రక్టోజ్‌-గ్లూకోజ్‌ ఉండే పానీయాలు ఈ స్వీట్‌ డ్రింక్స్‌లో ఉన్నాయి. మొత్తానికి ప్రతి రోజూ అధికంగా తియ్యని పానీయాలు తీసుకునే వారిలో 23 శాతం గుండె సమస్యలు కలిగే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది.