అరటిపండు, అవకాడోతో హృదయం పదిలం

07-10-2017: పొటాషియం ఎక్కువగా ఉండే అరటి, అవకాడోలను రోజూ తింటే హృద్రోగాలను అడ్డుకోవచ్చని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ధమనుల కాఠిన్యాన్ని నివారించి రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తాయని చెబుతున్నారు. తక్కువ పొటాషియంతో రక్తనాళాలు గట్టిపడి రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుందని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన భారత సంతతి శాస్త్రవేత్త అనుపమ్‌ అగర్వాల్‌ తెలిపారు.