35ఏళ్ల లోపు వారిపై తీవ్ర ప్రభావం
40శాతం పెరిగిన హృద్రోగ కేసులు
ఎస్బీఐ ఇన్సూరెన్స్ అధ్యయనం వెల్లడి
ముంబై, సెప్టెంబరు, 28: హృద్రోగ సమస్యలతో యువభారతం కుప్పకూలుతోంది. మన దేశంలో హృద్రోగుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ముఖ్యంగా మనోధైర్యానికి మారుపేరుగా భావించే యువతలోనే గుండె సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్త్తున్నాయి. 35 ఏళ్లలోపు వయసున్నవారిలో హృద్రోగ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ చేసిన అధ్యయనంలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే 2016-17లో హృదోగ్ర సంబంధిత కేసుల సంఖ్య 40 శాతం పెరిగాయని తెలిసింది. అదే 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 32 శాతం పెరిగాయని వెల్లడైంది. కాగా, గత ఏడాదితో పోలిస్తే పురుషుల్లో హృద్రోగ కేసుల సంఖ్య 12 శాతం పెరగ్గా, మహిళల్లో 5 శాతం తగ్గాయి. దేశంలో మహారాష్ట్రలో హృద్రోగాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, కేరళ, తమిళనాడు, హరియాణా, పశ్చిమబెంగాల్లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఈ అధ్యయనం చేసింది.