పిల్లలకు పాలివ్వకుంటే రొమ్ము కేన్సర్‌

క్రమంతప్పిన జీవనశైలి కూడా ఓ కారణమే 

ఆంధ్రజ్యోతి, 27-10-2016:  ఒత్తిడి..క్రమం తప్పిన జీవనశైలితోపాటు పిల్లలకు పాలివ్వకపోవడం తదితర కారణాలే మహిళల్లో రొమ్ము కేన్సర్‌కు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ కాలుష్యంతో పాటు పొగతాగే అలవాటు ఈ ప్రమాదాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయని సర్‌ గంగారాం ఆసుపత్రిలో సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ శ్యామ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

 భారతలో రొమ్ము కేన్సర్‌ కేసుల సంఖ్య ఇప్పటికే ప్రమాదకర స్థితికి చేరుకుందన్నారు. ప్రస్తుతం ఏటా దాదాపు లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. పెద్ద పట్టణాలలో నివసించే మహిళలు రొమ్ము కేన్సర్‌ బారినపడే ముప్పు ఎక్కువగా ఉందన్నారు. స్మోకింగ్‌, ఆల్కహాల్‌ అలవాట్లతో పాటు కాలుష్యం, ఒత్తిడి, క్రమం తప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు రొమ్ము కేన్సర్‌కు దారితీస్తున్నాయన్నారు.