పుట్టగొడుగులు తింటే ప్రొస్టేట్‌ కేన్సర్‌ దూరం!

09-09-2019: వారానికి మూడు సార్లు ఆహారంలో పుట్టగొడుగులను తీసుకొంటే ప్రోస్టేట్‌ కేన్సర్‌ దరిచేరదంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ కేన్సర్‌పై జపాన్‌లోని తొహోకు యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. 40 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కులు 36,499 మందిపై వారు పరిశోధనలు జరిపారు. వారందరిలో వారానికి ఒకటి లేదా రెండుసార్లు పుట్టగొడుగులు తిన్నవారి కంటే మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు తీసుకున్నవారు ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉన్నట్టు తెలిపారు. వీరికి ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పు కూడా లేదని వెల్లడించారు.