ఒత్తిడితో గర్భిణిలూ దురలవాట్లను వదలట్లేదు!

13-08-2019: గర్భిణిగా ఉన్నప్పుడు ధూమపానం, మద్యపానంవంటి దురలవాట్లు పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిసినప్పటికీ.. ఒత్తిడి కారణంగా చాలామంది మహిళలు వాటిని వదులుకోలేకపోతున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గర్భిణులపై దురలవాట్లు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయని తెలుసుకునేందుకు 25వేలమందికిపైగా గర్భిణులను పరిశీలించగా ఈ విషయం బయటపడిందని అమెరికాలోని లాసన్‌ ఆరోగ్య పరిశోధక సంస్థ పరిశోధకులు చెప్పారు.