వైద్యుల నిర్లక్ష్యం.. ప్రసవ వేదనతో గర్భిణి మృతి

శ్రీకాకుళం, 14-08-2019: మెలియాపుట్టి మండలం చాపర పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణి ప్రసవ వేదనతో మృతి చెందింది. పురిటి నొప్పులతో సవర కృష్ణవేణి(24) అనే మహిళ పీహెచ్‌సీ‌లో చేరింది. అర్ధరాత్రి తీవ్ర ప్రసవ వేదనతో కృష్ణవేణి మృతి చెందడంతో.. ఆమె కడుపులోని బిడ్డ కూడా కన్నుమూసింది. కృష్ణవేణి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. చాపర పీహెచ్‌సీ వద్ద కృష్ణవేణి బంధువులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి.