కొత్త అధికారులు.. సరికొత్త ఆలోచనలు

 

పారిశుద్ధ్యం, వైద్యంపై ప్రధానికి కొత్త ఐఏఎస్‌ల ప్రజెంటేషన్‌ 
ప్రజల భాగస్వామ్యంలో స్వచ్ఛ భారత సాధ్యమని వెల్లడి 
న్యూఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశంలో అయిదు లక్షల మంది వైద్యుల కొరత ఉంది.. మరి దీనికి పరిష్కారం ఏంటి.. ఆలోచించారు కొత్త ఐఏఎ్‌సలు. వైద్యుల కోసం ఒక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు వైద్యం అందించాలని సూచించారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎ్‌సలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్‌ కార్యదర్శి హోదాలో శిక్షణ తీసుకున్నారు. రెండేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న వీరు తమ క్యాడర్‌ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యం, పారిశుద్ధ్యం అంశాలపై ప్రధానికి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ వివరాలు.. 
 
సమస్యలు 
 
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల లేమి 
5 లక్షల డాక్టర్ల కొరత, నగటున 20 కిమీలు వెళ్తేకాని డాక్టర్‌ అందని పరిస్థితి 
వెళ్లాంటే పేదలు రోజు కూలీ వదులుకోవాలి  దీంతో 50 శాతం పేదలు వైద్యానికి దూరమవుతున్నారు. 
చాలా గ్రామాల్లో రవాణా సదుపాయం రోజుకు ఒక్క సారే. 
 
పరిష్కారం 
డాక్టర్‌ ఆన్‌ కాల్‌ పేరిట కాల్‌ సెంటర్‌. 
దీంతో ఉచిత వైద్య సేవలు అందించాలి 
24 గంటల పాటు 23 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి. 
కాల్‌ సెంటర్‌లో వైద్యులను అందుబాటులో ఉంచాలి. 
అవసరమైతే ఎస్‌ఎంఎస్‌ ద్వారా ప్రిస్ర్కిప్షన్‌ పంపించాలి. 
 
 
కర్ణాటకలో అమలు 
డాక్టర ఆన్‌ కాల్‌ సేవలను 104 పేరిట కర్ణాటకలో అమలు చేస్తున్నారు. వీరు రోజుకు 26 వేల కాల్స్‌ను తీసుకుంటున్నారు. ఏడాదికి ఒక గ్రామీణ వ్యక్తికి రూ.400 ఆదా అయ్యాయి. 316 ఆత్మహత్యలను నిరోధించారు. 70 లక్షల మంది లబ్ది పొందారు. 
దీన్ని విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే రూ. 33 వేల కోట్లు ఆదా చేయొచ్చు. 
 
లక్ష మంది చిన్నారుల మృతి 
సమస్యలు 
 పరిశుభ్రత లోపించడంతో ఏడాదికి లక్ష మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. 
దేశంలో 12 శాతానికిపైగా జనాభా బహిరంగ మల విసర్జన చేస్తున్నారు 
దేశంలో ఉత్పత్తయ్యే వ్యర్థాల్లో 21.5 శాతం వర్ధ్యాలను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. 
స్వచ్ఛ భారత సాధనకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు చాలా అవసరం కానీ కేటాయించినంతా ఖర్చు చేయడం లేదు. 
 
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ 
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత సాధించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా మార్చాలని ఐఏఎ్‌సలు అభిప్రాయపడ్డారు. క్రౌడ్‌ ఫండింగ్‌ను ప్రోత్సహించి ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని సూచించారు. ఎన్నారైలు ఇందులో భాగస్వామ్యం చేయడంతో నిధులు సమీకరించవచ్చని సూచించారు.