ముగిసిన వరల్డ్‌ స్ట్రోక్‌ కాంగ్రెస్‌

హైదరాబాద్‌: బ్రెయిన్‌ స్ట్రోక్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం సవాల్‌గా మారుతుందని వైద్యులు అభిప్రాయపడ్డారు. పక్షవా తంపై సమగ్రంగా తెలుసుకుంటే చాలా మంది ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలున్నా యన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం అవసరమన్నారు. నాలుగు రోజుల పాటు హెచ్‌ఐసీసీలో నిర్వహించిన వరల్డ్‌ స్ట్రోక్‌ కాంగ్రెస్‌ శనివారంతో ముగిసింది. ఈ సదస్సుకు  దేశ విదేశాల నుంచి వైద్యులు హాజర య్యారు. దాదాపు 72 దేశాల నుంచి 1500 మంది వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భం గా వైద్యులు మాట్లాడుతూ బ్రెయిన్‌ స్ట్రోక్‌పై విస్తృత అవగాహన పెంచి ‘స్ట్రోక్‌ ఫ్రీ వరల్డ్‌’గా  మార్చాలని అభి ప్రాయపడ్డారు. ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో మూడో వంతు మంది నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నుంచి వైద్యుల అనుమతి లేకుండానే డిశ్చార్జీ చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూరాలజిస్టు సుదీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మన దేశంలో న్యూరాలజిస్టుల కొరత తీవ్రంగా ఉందని, 8.3 లక్షలకు ఒక న్యూరాలజిస్టు మాత్రమే ఉన్నారని తెలిపారు. దేశంలో 125 కోట్ల జనాభా ఉండగా, న్యూరాలజిస్టులు కేవలం 1500 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు కనిపించిన మూడు గంటల్లో ఆస్పత్రికి చేరిస్తే చికిత్సతో ముప్పు నుంచి తప్పించే అవకాశముందని ఆయ అన్నారు.  బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన తరువాత కూడా చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. సదస్సు  కో-చైర్మన్‌ డాక్టర్‌ జయ్‌రాజ్‌ పాండియాన్‌ మాట్లాడుతూ అమెరికా, చైనా, అస్ట్రేలియా, కెనడా, జర్మనీ, బ్రెజిల్‌, ఈజిప్టు, రష్య, ఆఫ్రికా, స్వీడన్‌, పోలాండ్‌ తదితర దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు వర్నర్‌ హకే, డాక్టర్‌ అశోక్‌ ఉప్పల్‌, డాక్టర్‌ ధీరజ్‌ కరుణ, డాక్టర్‌ సౌమ సౌమిత్రి, పూజా కత్రి, మైఖెల్‌, తదితరులు పాల్గొన్నారు.