బోస్టన్, 09-08-2019: పొద్దుటే ఒక కప్పు కాఫీ తాగితే ఎంతో ఎనర్జీ ఇస్తుంది. కానీ అదే మోతాదు మించితే ఆరోగ్యానికి హాని అని తాజా సర్వే హెచ్చరిస్తోంది. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే మైగ్రేన్ ముప్పు అధికమవుతుందని చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారని బెత్ ఇజ్రాయెల్ డీకోన్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. రోజుకు రెండు కప్పులు తాగినప్పుడు ఏ ఇబ్బందులు రాలేదని, మూడో కప్పు తాగితే విపరీతమైన తలనొప్పితో బాధపడుతునట్లు వివరించారు.