చర్మానికి తగ్గ మేకప్‌.. అన్నీ అందరికీ సరిపోవు

ఆంధ్రజ్యోతి (10-09-2019): మేకప్‌తో అందం రెట్టింపవుతుంది. కానీ మేకప్‌ సరిగా వేసుకోకుంటే ముఖం నీరసంగా, కళ తప్పినట్టు కనిపిస్తుంది. చర్మతత్వానికి సరిపోయేలా మేకప్‌ ఉండాలంటున్నారు బ్యూటీషియన్‌ సమారియా మళ్లారి. ఆమె చెబుతున్న మేకప్‌ టిప్స్‌ కొన్ని... 

 
ఫౌండేషన్‌: మీ స్కీన్‌ టోన్‌కు సరిపోయే ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. మేకప్‌ వస్తువుల్ని కొనేముందు మణికట్టు, ముంజేతి మీద రాసుకొని చూడాలి. దాంతో మీకు ఏ స్కిన్‌షేడ్‌ నప్పుతుందో తెలుస్తుంది.
 
మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌: ఒంట్లో నీరు తగ్గిపోయినప్పుడు ముఖం పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. దీంతో మేకప్‌ సహజంగా రాదు. అలాంటప్పుడు మేలైన మాయిశ్చరైజర్‌ లేదా సీరమ్‌ను ఉపయోగించాలి. మృదువైన చర్మం ఉన్నవారు‘సెటాఫిల్‌’ మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ వాడితే మంచిది.
 
మేకప్‌ తొలగించాలి: ఎంత అలిసిపోయినప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాత్రిపూట మేకప్‌ తొలగించడం మర్చిపోవద్దు. అలానే నిద్రపోవడం వల్ల మేకప్‌ చర్మానికి హానిచేస్తుంది.
 
కాల పరిమితి: సౌందర్య సాధనాలకు కూడా కాలపరిమితి ఉంటుంది. కాబట్టి తేదీ ముగిసిన సౌందర్య ఉత్పత్తులను వాడకపోవడమే మేలు.