‘మలేరియా’లో భారత్‌కు నాలుగో స్థానం

2017లో కోటి కేసులు: లాన్సెట్‌ నివేదిక..
మలేరియా అంతమే మా లక్ష్యం: హర్షవర్థన్‌

పుణె, సెప్టెంబరు 10: ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు అత్యధికంగా నమోదయ్యే దేశాల్లో 2017 సంవత్సరానికిగానూ భారత్‌ నాలుగో స్థానంలో నిలిచిందని ప్రముఖ లాన్సెట్‌ జర్నల్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4ు భారత్‌లో నమోదైనవేనని తెలిపింది. అన్ని దేశాల్లో కలిపి మొత్తం 21.90 కోట్ల కేసులు నమోదు కాగా, భారత్‌లో కోటికిపైగా నమోదయ్యాయని తెలిపింది. భారత్‌ కంటే ముందు ఆఫ్రికా దేశాలైన నైజీరియా, కాంగో, మొజాంబిక్‌ ఉన్నాయని చెప్పింది. కాగా, దేశంలో మలేరియాను అంతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ సోమవారం ప్రకటించారు. పుణెలో వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ ప్లాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మలేరియాతో పాటు టీబీ, మెదడువాపు, కాలజ్వరం వంటి వాటిని తరిమికొట్టేందుకూ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు.

2017లో కేసుల వివరాలు..
ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసులు: 21.90 కోట్లు
భారత్‌లో నమోదైనవి: కోటి
భారత్‌ స్థానం: 4
తొలి మూడు దేశాలు: నైజీరియా, కాంగో, మొజాంబిక్‌