అందానికి అరటిపండు!

 

ఆంధ్రజ్యోతి (11-06-2019): అరటిపండు ఆరోగ్యప్రదాయిని అని తెలుసు. అంతేనా దీని గుజ్జు చర్మాన్ని యవ్వనంగా, కాంతిమంతంగా చేస్తుంది. కురులను సుతిమెత్తగా, పట్టులా మెరిసేలా చేస్తుంది. మాయిశ్చరైజర్‌గా: చర్మానికి పోషణ, తాజాదనాన్ని ఇస్తుంది. పొడిచర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసి మృదువుగా చేస్తుంది. దీనిలోని విటమిన్‌ స్కిన్‌కు తేమ అందించి, పొడిబారిన, దెబ్బతిన్న చర్మాన్ని సుతిమెత్తగా మార్చుతుంది.

జిడ్డు మాయం: అరటిపండు చర్మం మీది మృతకణాలను తొలగిస్తుంది. అలానే అదనపు సెబాన్ని తొలగించి చర్మం జిడ్డుగా కనిపించనీయదు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద గీతలు, ముడతలను నివారించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

నల్ల మచ్చలు మాయం: ఈ పండులోని ఎ విటమిన్‌, జింక్‌, మాంగనీస్‌లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖం మీద రుద్దుకుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి.
 
కేశాలు పట్టులా: అరటిపండులోని సిలికా కొల్లాజెన్‌ గ్రహించడంలో దోహదపడుతుంది. దీనిలోని కార్బోహైడ్రేట్లు, సహజ నూనెలు వెంట్రుకలకు పోషణనిచ్చి, మృదువుగా మారుస్తాయి. కురులకు బనానా మాస్క్‌ అప్లై చేస్తే వాటికి తేమ అంది, చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌, బ్యాక్టీరియా మటుమాయం అవుతాయి.